భారత్ లో భారీగా కరోనా కేసులు... భయం వద్దు అలా చేయండి చాలు..?
ప్రస్తుతం భారత దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగి పోతున్న విషయం తెలిసిందే. అంతకు ముందు వరకు అతి తక్కువ గా ఉన్న కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీ మొత్తంలో భారతదేశంలో పెరిగిపోతూ ఏకంగా రెండు లక్షల కేసులు దాటి పోయిన విషయం తెలిసిందే. ప్రతి రోజు ఏకంగా పది వేలకు పైగా కొత్త పాజిటివ్ కేసులు నమోదు కావటం ఆందోళనకర పరిస్థితులకు దారి తీస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పై ఎంతోమంది విమర్శలు కూడా చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ అమలులో పూర్తిగా విఫలమైందని కరోనా వైరస్ కట్టడిలో ప్రభుత్వ అసమర్థత కనిపిస్తుంది అని విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇక దీనిపై రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారంటే.. భారత్లో ఇప్పుడు అందరూ ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రేటు చాలా తక్కువగా ఉంది అని చెబుతున్నప్పటికీ కొంతమంది మాత్రం విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నారు అంటున్నారు. ఏకంగా భారత్ లో వచ్చేనెలకి కోటి కేసులు పెరిగిపోతాయని ప్రజలు ఆందోళన కలిగించే విధంగా కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. భారతదేశంలో నగరాలలో విస్తరించడానికి తబ్లిక్ సమావేశం కారణమైతే పల్లెల్లో కూడా ఈ మహమ్మారి వైరస్ విస్తరించడానికి వలస కూలీలు కారణమయ్యారు అనే చెప్పాలి,
ఈ నేపథ్యంలో అసెంప్టమాటిక్ కేసులో భారీగా పెరిగిపోయాయి వాటి ఫలితమే ప్రస్తుతం భారత దేశంలో రోజురోజుకు భారీ మొత్తంలో కేసులు పెరిగిపోతున్నాయి అని అంటున్నారు విశ్లేషకులు. అయితే ప్రస్తుతం కేసులు పెరుగుతున్నప్పటికీ లాక్ డౌన్ సడలింపు మాత్రం ఎక్కువగా ఇస్తున్నారు. అంటే ఇక ప్రస్తుతం ప్రభుత్వం చేసేదేమీ లేదు ప్రతి ఒక్కరు హెర్డ్ ఇమ్యూనిటీ వైపు వెళ్లాల్సిందే అంటున్నారు విశ్లేషకులు, అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా భారతదేశంలో కరోనా వైర్లెస్ కంట్రోల్ లోనే ఉంది విజృంభించే స్థాయిలో లేదు అని చెబుతున్నారు.