తెలంగాణలో కోరలు చాచిన కరోనా.. ఒకేసారి ఆరుగురు మృత్యువాత ..

Satvika

కరోనా... ఒక మనిషిని ఎక్కడ వస్తుందా అనే ఆలోచనలతో చంపేసిన వైరస్ .. అందుకే వదలని మహమ్మారి అని అంటారు.. ఎక్కడో మొదలై ప్రపంచ దేశాలు వ్యాపించిన ఈ కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటుంది... ప్రభుత్వం ఎన్ని రకాలా కీలక చర్యలు చేపట్టిన కూడా మనిషిని పట్టిపీడిస్తోంది ఈ మహమ్మారి .. దేశ దేశాల్లు చక్కర్లు కొడుతోంది.. భూమీద బ్రతికే చిన్ని ప్రాణులకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తుంది.. 

 

 


దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కరోనా ను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం జనతా కర్ఫ్యూ నీ విధించింది...అయిన కరోనా ఎక్కడ కట్టడి చేసిన దాఖలు లేవు.. అయితే ఇప్పుడు కరోనా ప్రభావం ఎక్కడ తగ్గక పోగా ఇంకా పెరిగింది..కరోనా ను అరికట్టేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం ఈ మేరకు లాక్ డౌన్ కూడా ప్రకటించింది.. ప్రజలు బయటకు కదలలేని పరిస్థితి నెలకొంది.. రెండు చేతుల పనిచేస్తే కానీ నాలుగు వేళ్ళు నోటిలోకి వెళ్ళ వు అలాంటి పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలవడానికి సినీ తారలు కదిలి వచ్చారు.. 

 

 

 

ప్రముఖులు కూడా వారికి తోచిన సాయన్ని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందజేస్తున్నారు.. అయినా కరోనా వ్యాప్తి మాత్రం ఎక్కడ తగ్గలేదు.. ..అందుకే కరోనా ప్రభావాన్ని పూర్తిగా తగ్గించేందుకు ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది.. ఈ మేరకు జనతా కర్ఫ్యూ నీ కూడా ప్రకటించింది.. కరోనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ విధించింది ..కరోనా సోకకుండా ఎంత కఠినంగా చర్యలు చేపట్టిన కూడా కరోనా ఉగ్రరూపం దాల్చుతుంది..

 

 

 

తెలంగాణలో కరోనా ప్రభావం రోజు రోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే..గడచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో ఆరుగురు మరణించారు. దాంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 148కి చేరింది. కొత్తగా 178 కరోనా కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 143 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. మొత్తమ్మీద రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 3,920కి పెరిగింది. ఇప్పటివరకు 1,742 మంది డిశ్చార్జి కాగా, 2,030 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.కరోనా ప్రభావం పెరుగుతుండటంతో మళ్లీ లాక్ డౌన్ ను అమలు చేయడం కాయమని సదరు అభిప్రాయపడ్డారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: