కరోనా గురించి చైనా దాచిన భయంకరమైన నిజం.. శాటిలైట్ ఇలా బయటపెట్టింది...?

Chakravarthi Kalyan
కరోనా విషయంలో చైనా సర్కారు మొదటి నుంచి అబద్దాలే చెబుతూ ప్రపంచాన్ని మోసం చేస్తోంది. ఈవిషయం మరోసారి రుజువైంది. కరోనా వైరస్ ను మొదట తాము డిసెంబర్ లో గుర్తించామని చైనా ఇప్పటి వరకూ ప్రపంచాన్ని నమ్మిస్తోంది. కానీ అసలు వాస్తవం అది కాదట. కరోనా వైరస్‌ చైనా చెబుతున్నట్టు గత డిసెంబరులో కాకుండా, అంతకుముందు ఆగస్టులోనే వుహాన్‌లో బయటపడిందట.

ఈ భయంకరమైన వాస్తవాన్ని అమెరికాలోని హార్వర్డ్‌, బోస్టన్‌ విశ్వవిద్యాలయాల నిపుణులు బయటపెట్టారు. ఇందుకు వారు ఆధారాలు కూడా బయటపెట్టారు. అసలు విషయం ఏంటంటే.. ఆగస్టు నెలాఖరు నుంచి డిసెంబరు వరకూ వుహాన్‌లోని ఐదు ఆసుపత్రుల వద్ద వాహనాల రద్దీ అంతకంతకూ పెరిగిందట. ఈ విషయం స్పష్టంగా ఉపగ్రహ చిత్రాల్లో నమోదైందట. ఈ శాటిలైట్ పిక్చర్లను పరిశోధించిన సైంటిస్టులు ఈ విషయాన్ని ద్రువీకరిస్తున్నారు.

వుహాన్‌ ఆసుపత్రుల పరిసరాలకు సంబంధించి 2018-19 మధ్య వాణిజ్య ఉపగ్రహాలు చిత్రీకరించిన పలు దృశ్యాలను, డేటాను పరిశోధకులు విశ్లేషించి చైనా గుట్టు బయటపెట్టారు. అంతే కాదు.. చైనాలో ఆగస్టులోనే అక్కడి జనం ఎక్కువగా ‘దగ్గు’, ‘విరేచనాలు’ వంటి కరోనా లక్షణాల గురించి తెలుసుకోవడానికి ఆన్‌లైన్‌లో సెర్చ్ చేశారట. 2018 అక్టోబరులో వుహాన్‌లోని అతిపెద్ద టియాన్యూ ఆసుపత్రి వద్ద మొత్తం 171 కార్లు నిలిపి ఉంచారట.

2019లో అదే సమయంలో అక్కడ 285 వాహనాలు ఉన్నట్టు లెక్క తేలింది. అంటే ఏకంగా 67% ఎక్కువగా ఆసుపత్రి వద్ద వాహనాలు నిలిపినట్టు రుజువులు ఉన్నాయి. ఇలా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలపడం అసాధారణం. ఇదంతా కరోనా వల్లనే జరిగిందని పరిశోధకులు విశ్వసిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: