కడుపు నొప్పి అని వచ్చింది.. ఎక్స్‌రే తీసి చూస్తే.. డాక్టర్లకే మతి పోయింది...?

Chakravarthi Kalyan
ఒక్కోసారి కొన్ని వార్తలు చూస్తే అసలు నమ్మబుద్ది కాదు.. ఇలా కూడా జరుగుతుందా అనిపిస్తుంది. సాధారణంగా మనం అన్నం తింటుంటే.. ఒక వెంట్రుక వచ్చిందంటే చాలా చిరాకు పడతాం. ఆ భోజనం చేసిన వాళ్లపై విరుచుకుపడతాం. అంత దారుణంగా ఉంటుంది. మరి అలాంటిది ఏకంగా అరకేజీ వెంట్రుకలు తినేయడం అంటే.. ఊహించుకుంటేనే ఏదోలా ఉంది కదా.

కానీ ఈ ఘటన నిజంగానే జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం యాద్గార్‌పల్లి గ్రామానికి చెందిన ఏడేళ్ల ప్రణీతకు చిన్నతనం నుంచే వెంట్రుకలు, దారాలు తినే అలవాటుంది. కానీ ఆ విషయం ఇంట్లో తెలియదు. ఈ మధ్య తరచూ కడుపునొప్పితో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు బాలికను మిర్యాలగూడలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు.

డాక్టర్లు సమస్య తెలుసుకునేందుకు సీటీ స్కాన్‌లో తీశారు. కడుపులో ఏదో కణతి ఉన్నట్లు గుర్తించి ఆపరేషన్ చేశారు. తీరా ఓపెన్ చేసి చూస్తే.. డాక్టర్లే షాకయ్యారు. లోపల వెంట్రుకలు, దారాలతో కూడిన ముద్ద ఉన్నట్టు గుర్తించామని, అది 13 సెంటీమీటర్ల పొడవు, అరకిలో బరువు ఉందని’ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.

ఆ మధ్య తమిళనాడులోనూ ఇలాంటి ఘటనే జరిగింది. 13ఏళ్ల బాలిక కడుపులో అరకిలో జుట్టు, ఖాళీ షాంపు ప్యాకెట్లు బయటపడ్డాయి. ఈ ఘటన కోయింబత్తూరు ఆస్పత్రిలో వెలుగులోకి వచ్చింది. 7వ తరగతి చదువుతున్న బాలిక కడుపులో నుంచి జుట్టు, ఖాళీ షాంపు ప్యాకెట్లను విజయవంతంగా సర్జరీ చేసి తొలగించినట్టు వైద్యులు వెల్లడించారు. కొన్ని నెలల నుంచి బాలిక తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతోంది. రెండు రోజుల క్రితం నొప్పి మరింత తీవ్రం కావడంతో ఆమెను కోయింబత్తూరు ఆస్పత్రికి తరలించారు. చిన్నారికి వైద్యపరీక్షలు చేసిన వైద్యులు షాక్ అయ్యారు. ఆపరేషన్ చేసి తీసేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: