చంద్రబాబును తక్కువగా అంచనా వేయవద్దు... జగన్ కు సూచిస్తున్న విశ్లేషకులు....?

Reddy P Rajasekhar

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును తక్కువగా అంచనా వేయవద్దని సీఎం జగన్ కు, వైసీపీ నేతలకు విశ్లేషకులు సూచిస్తున్నారు. రాజకీయ ఎత్తుగడల్లో చంద్రబాబు అపర చాణిక్యుడు అని చాలామంది చెబుతూ ఉంటారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్, సుధాకర్ కేసుల్లో వైసీపీకి వ్యతిరేకంగా తీర్పులు వెలువడడం వెనుక చంద్రబాబు రాజకీయ చతురత ఉందని విశ్లేషకులు బలంగా విశ్వసిస్తున్నారు. 
 
ఒక పార్టీని పరిపూర్ణంగా నడిపిన వ్యక్తుల్లో ఒకరిగా చంద్రబాబు గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమ్ ఆద్మీ లాంటి పార్టీ నేతలు కూడా పార్టీని నడిపే విధానంలో చంద్రబాబును అనుసరిస్తారనడంలో ఆశ్చర్యం లేదు. చంద్రబాబు రాజకీయాల్లో అధికారంలో ఉన్నప్పుడు ఒక స్ట్రాటజీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో స్ట్రాటజీ ఫాలో అవుతూ ఉంటారు. టెక్నాలజీని వాడుకోవడంలో కూడా చంద్రబాబుకు ఎవరూ సాటి రారు. 
 
చంద్రబాబు ప్రభుత్వం చేసే మంచి పనులను కూడా టీడీపీ సానుభూతిపరుల ద్వారా పిటిషన్లు వేయించి వైసీపీకి చెడ్డపేరు వచ్చేలా చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ నాయకుల అరెస్ట్ ల పర్వం కొనసాగుతోంది. అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ లతో చంద్రబాబు వణికిపోతున్నారని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే చంద్రబాబు మరో స్ట్రాటజీతో ముందుకు వెళతారని తెలుస్తోంది. 
 
చంద్రబాబు రాష్ట్రంలో బీజేపీ, జనసేనలతో సన్నిహితంగా మెలగడానికి ప్రయత్నిస్తున్నారు. పార్టీలోని నాయకులు, క్యాడర్ పోకుండా వారికి భరోసా ఇస్తున్నారు. లోకేష్ ను ముందుంచి పార్టీని నడిపించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. అధికార పార్టీని చూసి భయపడుతున్న టీడీపీ నేతలు భయాందోళనకు గురి కాకుండా సీనియర్ నేతలను రంగంలోకి దింపి వారిలో ధైర్యం నింపుతున్నారు. చంద్రబాబు వ్యూహాలను ఎవరూ కనిపెట్టలేరని... సీఎం జాగ్రత్తగా ఉండాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.                           

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: