తెలుగు దేశం కొంప ముంచబోతున్న యనమల అతి తెలివి..?

Chakravarthi Kalyan
ఏపీ రాజకీయాలు మహా రంజుగా సాగుతున్నాయి. అధికార, విపక్షాలు రెండూ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ రాజకీయం సాగిస్తున్నాయి. నిన్న మండలిలో మరోసారి పైచేయి సాధించాలని టీడీపీ చేసిన ప్రయత్నం మరోసారి రాజకీయ చర్చకు దారి తీసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా పనులు సాగించాలంటే వెసులుబాటు కల్పించాల్సిన బడ్జెట్ కు మండలిలో ఆమోదం లభించని విచిత్రమైన పరిస్థితి ఏపీలో ఉంది.

సాధారణంగా బడ్జెట్ బిల్లు అసెంబ్లీలో ఆమోదం తర్వాత మండలికి వెళ్తుంది. మండలిలో ఈ బిల్లు తప్పనిసరిగా ఆమోదం పొందాలి. అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం దేనికైనా నిధులు విడుదల చేయగలుగుతుంది. లేకుంటే పైసా కూడా ఖర్చుచేయడం కుదరదు. కానీ.. ఇప్పుడు యనమల వంటి టీడీపీ నేతల అతి తెలివితో శాసన మండలి బడ్జెట్ ను కూడా ఆమోదించకుండానే నిరవధింగా వాయిదా పడింది.

బడ్జెట్ బిల్లును మండలి ఆమోదించకపోయినా ఇబ్బంది లేదు.. కానీ దాన్ని ఆమోదించినట్టే భావించడానికి 15 రోజులు సమయం పడుతుంది. అప్పటి వరకూ ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలు ఆగిపోతాయి. ప్రభుత్వానికి చెందిన కీలకమైన రాజధాని బిల్లు, సీఆర్డీఏ బిల్లులను అడ్డుకునేందుకు యనమల ఈ ఎత్తు వేశారు. కానీ.. దీని వల్ల అసలు కీలకమైన బడ్జెట్ బిల్లు ఆగిపోయింది.

అందువల్ల ఇప్పుడు ప్రభుత్వానికి టీడీపీ మొండి వైఖరి కారణంగానే తాము జీతాలు ఇవ్వలేకపోయామని.. పింఛన్లు ఇవ్వలేకపోయామని ప్రచారం చేసుకునే అవకాశం దక్కింది. దీంతో ఆయా వర్గాల్లో టీడీపీ పట్ల ఆగ్రహం వ్యక్తంకాక తప్పదు. దీని వల్ల టీడీపీకి ఒనకూరే లాభం లేకపోగా.. ఉద్యోగుల జీతాలు ఆపేందుకు కూడా టీడీపీ కుట్ర పన్నిందన్న అపవాదు మోయాల్సి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: