ఫాదర్స్ డే స్పెషల్ : తండ్రి రాజకీయ బాటలో కొడుకు ప్రస్థానం

Suma Kallamadi

దిగవంత ముఖ్యమంత్రి వైయస్. రాజశేఖర్ గురించి అందరికి తెలుసు. తండ్రి బాటలనే కొడుకు తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. అయితే అప్పట్లో తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ పై నెగిటివ్ ముద్ర అదికంగా ప్రచారం అయ్యేది. అయినా ఆయన పట్టించుకోలేదు. తండ్రి అనూహ్య మరణం తర్వాత తాను అనుకున్న విదంగా ముందుకు సాగింది. అయితే తన ఇమేజీని పాజిటివ్ గా మార్చుకోవడమే కాకుండా.. పలు సంక్షోభాలను ఎదిరించి నిలబడ్డ నేత దేశంలోనే జగన్ ఒక్కరే అంటే ఆశ్చర్యం కాకపోవచ్చు.ఆయన ఎవరినో కూలదోసో అదికారంలోకి రాలేదు. తన రెక్కల కష్టంతో అదికారం సాదించాడు. 2009 లో కాంగ్రెస్ ఐ ఎ మ్.పిగా గెలుపొందిన ఆయన రాజకీయం ఇన్ని మలుపులు తిరుగుతుందని అప్పట్లో ఎవరూ ఊహించలేదు. ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.

 


జగన్ పార్టీ స్థాపించడానికి దారి తీసిన కారణాలు అందరికీ తెలిసిందే. ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ.. రెండుసార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సీఎంగా ఉన్నసమయంలో హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన ప్రాణాలు విడిచారు ఈ విషయం అందరికి తేలిసిందే. జగన్ తండ్రి పేరు కలిసేట్టుగా పార్టీని స్థాపించారు. 2014లో ఎన్నికలో పరాజయం పొందగా 2019 ఎన్నికల్లో భారీ విజయాన్ని అందుకున్నారు.

 


తన పాలనతో తండ్రిని మించిన తనయుడిగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పేరుతెచ్చుకున్నారు. అతి తక్కువ సమయంలో మంచి సీఎంగా మన్ననలు పొందుతున్నారు. జనాభా ప్రాతిపదికతో పాటు మానవతా దృక్పథంతో బీసీల అభ్యున్నతికి చట్టబద్ధంగా అడుగులు వేయడం అభినందనీయం. బీసీల అభివృద్ధిని కాంక్షించే సీఎంగా పేరుకెక్కారు.

 

 

ఇచ్చిన మాట ప్రకారం హామీలను అమలుచేస్తున్న ఏకైక సీఎం జగన్‌మోహన్‌రెడ్డి. ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైన నాటి నుంచి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ మాదిరిగా బీసీల గుర్తింపు, అభివృద్ధి, సంక్షేమం, మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టారు. ఇప్పుడు వాటిని నెరవేర్చారు. ఇక బీసీల పయనమంతా ఆయన వెంటే ఉన్నారన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: