బాబోయ్.. భారత్‌ పై చైనా ఇంత దారుణంగా కుట్ర పన్నిందా..?

Chakravarthi Kalyan
ఇండియా - చైనా సరిహద్దులు మరోసారి ఉద్రిక్తంగా మారుతున్నాయి. చైనా ఇప్పటికే గల్వాన్ లోయను తమ భూభాగంగా ప్రకటించింది. ఇక్కడే మొన్న ఘర్షణ జరిగి 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇన్నాళ్లూ లేని గొడవలు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి.. ఈ ప్రశ్నలు ఇప్పుడు ఉదయిస్తున్నాయి. దీనికి సమాధానం వెదుకుదాం..

భారత్ తూర్పు సరిహద్దులలో అత్యంత కీలకమైన లడ్డఖ్ ను తన చెప్పుచేతుల్లో పెట్టుకుంటే భారత్ మీద పైచేయి సాధించవచ్చనే కోరిక ఎప్పట్నుంచో చైనా మదిలో ఉంది. ఇక్కడ గల గల్వాన్ నదికి అభిముఖంగా భారత్ తన సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకుంది. లడ్డాఖ్ ఈశాన్య భాగమైన సబ్ సెక్టార్ నార్త్ లేదా దౌలత్ బేగ్ ఓల్డి భారత ఆధీనంలో ఉన్న భూభాగాల్లో ఇక్కడ తన సైనికపోస్టులను బలోపేతం చేయాలనుకుంటున్న ప్రతిసారి చైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది.

ఇదేప్రాంతంలో LOC కి అత్యంత సమీపంలోనే పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ కోసం చైనా వ్యూహాత్మకంగా ఒక పెద్ద రహదారి నిర్మాణం చేపట్టింది. సియాచిన్ గ్లేషియర్ మీద సైతం కన్నేసి అక్కడ గల భారత దళాలను తరిమేస్తే భవిష్యత్తులో కాశ్మీర్ ను ఆక్రమించవచ్చని కుట్రలు పన్నుతోంది. వాస్తవానికి కాశ్మీర్ మీద చైనా లక్ష్యం ఈనాటిది కాదు. కాశ్మీర్ విషయంలో తలదూర్చి భారత్ ను ఇబ్బంది పెట్టే దిశగా చైనా ఎప్పటి నుంచో పావులు కదుపుతోంది.

గతంలోనూ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని గిల్గిట్ లో గల హుజా ప్రాంతం తనదేనని చైనా గతంలో ప్రకటించుకుంది. ఆ ప్రాంతాన్ని చివరకు పాకిస్తాన్ కు ఇచ్చివేసింది. తాజాగా ఈ దాడుల అంతరార్థం కూడా అదే. కానీ భారత్ ఎప్పటికప్పుడు ఈ కుట్రలను విజయవంతంగా ఛేదిస్తూనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: