విజృంబిస్తున్న పాములు .. కలవరపడుతున్న ప్రజలు !

KSK

ఏపీ లో కృష్ణా జిల్లా ని ప్రకృతి టార్గెట్ చేసినట్లు ఉంది. కరోనా వైరస్ ఇటీవల లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత భయంకరంగా కొత్త పాజిటివ్ కేసులు బయటపడటం జరిగాయి. అధికార యంత్రాంగం పరిపాలన మొత్తం ఆ ప్రాంతంలో ఉండటంతో ఏపీ సర్కార్ ఈ విషయంపై వెంటనే దృష్టి సారించింది. దీంతో కృష్ణా జిల్లా కలెక్టర్ ఎక్కడికక్కడ లాక్ డౌన్ అమలు చేస్తూ వైరస్ చైన్ అరికట్టడానికి కృషి చేస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వర్షాకాలం రావటంతో కృష్ణా జిల్లాలకు చెందిన రైతులు పొలం లోకి వెళ్లి పాముకాటుతో చనిపోతున్నారు. వర్షాకాలం నేపథ్యంలో పొలాల భూముల నుండి చల్లదనానికి పాములు కృష్ణా జిల్లాల పంట పొలాలలో విజృంభిస్తున్నాయి.

 

దాదాపు ఈ నెలలోనే పాము కాటు వల్ల 19 కేసులు నమోదైనట్లు కృష్ణా జిల్లాలో వార్తలు వినబడుతున్నాయి. గత ఏడాదిలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. వర్షాకాలం ప్రారంభం అవ్వటంతో ప్రతి గ్రామంలో ఆరోగ్య కేంద్రాల్లో పాము కాటుకు మందులు సిద్ధంగా ఉంచాలని ఈ సందర్భంగా వైద్యాధికారులు డిసైడ్ అయ్యారు. ఇటీవల ఏకంగా ముగ్గురు రైతులు పాముకాటు ఒకే రోజు వేయడం జరిగింది. జిల్లాలోని పమిడిముక్కల మండలం గండ్రగూడెంలో పొలంలో పనులు చేసుకుంటున్న ముగ్గురు రైతులు పాము కాటుకు గురయ్యారు.

 

వీరిని రక్త పింజరి జాతి పాములు కాటు వేశాయి. సమయానికి స్పందించి ఆస్పత్రికి తరలించడంతో వీరు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. దీంతో రోజు రోజుకి పాముకాటు వార్తలు ఎక్కువగా వినపడటం తో కృష్ణా జిల్లా రైతాంగం లో ఆందోళనలు మొదలయ్యాయి. మరోపక్క ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఆరోగ్య కేంద్రాల్లో పూర్తి స్థాయి వైద్యం పాముకాటుకు ఉండేలా ఇప్పటి నుండే అలర్ట్ అవుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: