ట్రంప్ దగ్గర ఆ బటన్ ఉందా.. నొక్కితే అంతా నాశనమేనా..?
ప్రస్తుతం భారత్-చైనా మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. గాల్వాన్ సరిహద్దుల్లో ప్రస్తుతం చైనా భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇక మొన్నటికి మొన్న గాల్వన్ లో భారత్-చైనా సరిహద్దుల్లో ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ కూడా జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణలో ఏకంగా భారత సైన్యానికి చెందిన 20 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా అటు చైనా సైన్యానికి చెందిన కొంతమంది కూడా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్ గా కొనసాగుతోంది. రాబోయే రోజుల్లో చైనా భారత్ మధ్య తలెత్తిన వివాదం ఎంత వరకు దారి తీస్తుంది అన్నది చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా కొన్ని ఆసక్తికర విషయాలు చర్చకు వస్తున్నాయి. గతంలో రష్యా అమెరికా మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి సమయంలో రష్యా అధ్యక్షుడు చేతిలో ఒక బటన్ ఉంటుందని... అంతేకాకుండా అమెరికా అధ్యక్షుడు చేతిలో ఒక బటన్ ఉంటుందని అప్పట్లో చెప్పుకొనేవారు. ఆ బటన్ నొక్కితే అను బాంబు దాడి జరిగి అందరూ చచ్చిపోతారు అని అప్పట్లో టాక్ వినిపించింది. అయితే దీనిపై విశ్లేషకులు కాస్త భిన్నమైన వాదన వినిపిస్తున్నారు.
నిజంగానే డోనాల్డ్ ట్రంప్ చేతిలో అణుబాంబుల కు సంబంధించిన బటన్ ఉంటుందా అంటే... చేతిలో బటన్ కాదు ఒక బ్రీఫ్ కేస్ ఉంటుందని.. ఆ బ్రీఫ్ కేస్ పేరు న్యూక్లియర్ ఫుట్బాల్ అని అంటారు. అయితే అధ్యక్షుడు తక్షణ నిర్ణయానికి బ్రీఫ్ కేస్ ఎంతో కీలకంగా మారుతోంది. కానీ ఆ బ్రీఫ్కేస్ లో ఎలాంటి బటన్ లు ఉండవు . అందులో ఏమి ఉంటుంది అంటే యుద్ధ వ్యూహాలకు సంబంధించిన మ్యాపులు పుస్తకాలు ఉంటాయి. తక్షణ నిర్ణయం తీసుకునేందుకు ఇది వీలు కల్పించేలా ఉంటుంది. అంతేకాకుండా అధ్యక్షుడు దగ్గర బిస్కెట్ అనే ఒక కార్డు కూడా ఉంటుంది ఇందులో కొన్ని కోడ్ ల ఆధారంగా అధికారులకు...అణ్వయుధాలను ప్రయోగించాలని ఆదేశాలను జారీ చేయడానికి వీలుగా ఉంటుంది. అంతేతప్ప బటన్ లాంటివి ఏమీ ఉండవు అని అంటున్నారు విశ్లేషకులు.