రంగంలోకి అమిత్ షా.... చైనాకు భారత్ మార్క్ షాక్....?
చైనా భారత్ తో వివాదాలు పెట్టుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటే భారత్ నిర్మాణాలు ఆపేస్తుందని చైనా భావిస్తోంది. అయితే భారత్ చైనా ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ డ్రాగన్ దేశాన్ని చిత్తుచిత్తు చేస్తోంది. నిన్న అమిత్ షా సరిహద్దు వివాదాలు నెలకొన్న నేపథ్యంలో రంగంలోకి దిగారు. హోం శాఖను ప్రస్తుతం సరిహద్దుల్లో నిర్మాణాలు జరుగుతున్న రోడ్ల పరిస్థితి గురించి సమీక్ష జరపాలని సూచించారు.
దాదాపు 11,000 మంది కూలీలు రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. ప్రస్తుతం 21 నిర్మాణాలు శరవేగంగా పూర్తవుతున్నాయి. మూడొంతుల పనులు పూర్తి కాగా ఒక వంతు పనులు మాత్రం జరగాల్సి ఉంది. గతంలో అవసరాల కోసం కట్టిన వంతెన కూలిపోవడంతో ఎయిర్ ఫోర్స్ దగ్గర ఉన్న ప్రత్యేక విమానాల ద్వారా బరువుతో ఉండే వాహనాలను తీసుకెళుతున్నారు.
ఈ ప్రత్యేక విమానాల ద్వారా భారీ యంత్ర సామాగ్రిని, ప్రొక్లెయినర్లను, బుల్ డోజర్లను కూడా తీసుకెళ్లటం సాధ్యమవుతుంది. అమిత్ షా ఇకపై నిర్మాణాలు మరింత వేగంగా నిర్మాణాలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో చైనా వ్యుహాలకు అమిత్ షా భారత్ మార్క్ షాకులు ఇచ్చారు. చైనా భారత్ భూభాగాన్ని ఆక్రమించాలనే ప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో మన మీద ఆధిపత్యం చలయించామని ప్రపంచానికి చాటి చెప్పటానికి చైనా ప్రయత్నిస్తోంది.
మరోవైపు కరోనా విజృంభిస్తూ ఉండటంతో భారత్ తో పాటు ప్రపంచ దేశాలు చైనాకు వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నాయి. మరోవైపు భారత్ నిర్మాణాల్లో వేగం పెంచింది. ఇలా అన్ని విధాలుగా చైనాను భారత్ దెబ్బ తీస్తూ ముందడుగులు వేస్తూ ఉంది. అమిత్ షా రంగంలోకి దిగడంతో నిర్మాణాలు వేగంగా పూర్తైతే చైనా భవిష్యత్తులో ఏం చేయాలన్నా చేయలేని పరిస్థితి ఎదురవుతుందని చెప్పవచ్చు.