హైదరాబాద్ లో ఆ గలీజ్ పనులు చేసి బాబు ఈ స్థాయికి వచ్చాడట..!

Arun Showri Endluri
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల రూపు మారిపోయింది. పదహారేళ్ల క్రితం వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు… ఇప్పుడు అతని తనయుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి యొక్క పాలనకు ఎంతో తేడా ఉంది. ఆవేశం, ఆశయాలు ఒక్కటే అయినా ఆచరణలో మాత్రం స్పష్టమైన భేదం కనబడుతుంది. వివాదాస్పద నిర్ణయాలు తీసుకునే జగన్ ప్రజాభిమానాన్ని చూరగొంటున్న వైనం ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.

తన ఏడాది పాలన పై ప్రజల్లో అద్దిరిపోయే స్పందనను సొంతం చేసుకున్న జగన్ ను చూసుకొని వారి పార్టీ వారంతా రెచ్చిపోతున్నారు. తమను విమర్శించే వారి,వేలెత్తి చూపించే వారి విషయంలో కఠినంగా వ్యవహరించడం జగన్ బ్యాచ్ స్టైల్ అనే చెప్పాలి. వారి అధినేత ఇచ్చిన ప్రోద్బలం మరియు రాష్త్రంలో వారికున్న అశేషమైన ప్రజాదరణ చూసి వారు అవతలి వారిని ఎంత మాట అనడానికైనా వెనకాడటం లేదు.

తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్న మాటల్నే చూసినట్లైతే… నిమ్మగడ్డ రమేష్, కామినేని శ్రీనివాస్, సుజనాచౌదరి ల మీటింగ్పై విరుచుకు పడుతూనే చంద్రబాబును కూడా పనిలో పనిగా విపరీతంగా కడిగిపారేశారు. "హైదరాబాద్ లో బాబు చేసే గలీజ్ పనులు గురించి మీకు తెలుసా?" అంటూ అతని పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

బాబు ను ఉద్దేశించి… అతను గోతులు తవ్వుతారని, చీకటి వ్యాపారాలు చేస్తారని, అమాయకులను మానిప్యులేషన్ చేయడం మరియు వ్యవస్థలను అక్రమ మార్గంలో మేనేజ్ చేయడంలో మునిగి తేలుతుంటారు అని విజయసాయి రెడ్డి విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని వెన్నుపోటు ద్వారా విజయవంతంగా సమాధి చేసి. ఆఖరికి దళారి స్థాయికి వచ్చాడని ఆయన అన్నారు.

ఇక అధికారం దరిదాపుల్లోకి బాబు తన జీవిత కాలంలో రాలేడని తేల్చేసిన విజయసాయిరెడ్డి తన విమర్శలతో ఈ తరహాలో బాబు పై విరుచుకుపడడం ఇప్పుడు ఆంధ్రరాష్ట్రంలో సంచలనంగా మారింది. మరి ఇంతటి తీవ్రమైన వ్యాఖ్యలు చేయడానికి అతని ధైర్యం ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: