రష్యాకు చైనాను శాసించే స్థాయి ఉందా.....?

Reddy P Rajasekhar

కరోనా వైరస్ విజృంభణ వల్ల చైనాకు శత్రు దేశాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మొదట్లో చైనాపై భారత్ పెద్దగా విమర్శలు చేయకపోయినా సరిహద్దు వివాదాల నేపథ్యంలో భారత్ చైనా దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. భారతీయుల్లో చైనాపై, చైనా వస్తువులపై వ్యతిరేకత పెరుగుతోంది. అమెరికా, జపాన్ కూడా భారత్ కు మద్దతు ఇస్తూ చైనాపై విమర్శలు చేస్తున్నాయి. 
 
రష్యా కూడా భారత్ కు మద్దతు ఇస్తోంది. అయితే రష్యాకు చైనాను శాసించే స్థాయి ఉందా.....? అనే ప్రశ్నకు లేదనే జవాబు వినిపిస్తోంది. చైనా రష్యాపై ఆయుధాల తయారీ విషయంలో ఆధారపడుతుంది. గతంలో యుద్ధవిమానాల విషయంలో చైనా రష్యా నుంచి విమానాలను కొనుగోలు చేసి అలాంటి యుద్ధవిమానాలే తయారు చేయాలని ప్రయత్నించినా సక్సెస్ కాలేకపోయింది. రష్యాతో చైనాకు ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. 
 
రష్యా ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. భారత్ తో పోల్చి చూస్తే రష్యా ఆర్థిక స్థితి చాలా ఘోరంగా ఉంది. గతంలో చైనాను రష్యా లెక్క చేయలేదు. కానీ ప్రస్తుతం అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. ప్రపంచంలో ఇటు జనాభా పరంగా, ఆర్థిక వ్యవస్థ పరంగా చైనా, భారత్ మంచి స్థానాల్లో ఉన్నాయి. ఈ దేశాలను ఆర్థిక పరిస్థితి విషయంలో ఘోరంగా ఉన్న రష్యా శాసించే స్థితిలో లేదు. 
 
రష్యా ఇప్పటికే అంతర్గత సమస్యల వల్ల ఇబ్బందులు పడుతోంది. భూభాగం ఎక్కువగా ఉన్నా ఆదాయ వనరులు తక్కువగా ఉండటంతో రష్యా చైనాపై ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితి లేదు. అందువల్లే భారత్ కూడా రష్యాను ఎటువంటి సహాయం కోరట్లేదు. ఆయుధాలు కావాలని చెబుతుందే తప్ప ఎటువంటి సహాయం రష్యా నుంచి ఆశించటం లేదు. ఇద్దరిలో ఎవరి పక్షాన నిలబడినా నష్టపోయే అవకాశాలు ఉన్నాయని భావించి రష్యా భారత్ చైనాలో ఏ దేశం పక్షాన నిలబడలేకపోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: