కర్ణాటకలో కనికరం చూపని కరోన ...!
కర్ణాటకలో కరోనా వైరస్ రోజురోజుకి విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో గడచిన 24 గంటల్లో నమోదైన కేసుల వివరాలను కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా మీడియాకు తెలియజేయడం జరిగింది. ఇక బులిటెన్ ప్రకారం నేడు ఒక్క రోజే కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా 1272 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక ఈ కేసులతో కలుపుకొని రాష్ట్రంలో నేటి వరకు 16514 కేసులు నమోదయ్యాయి. మరోవైపు నేడు ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 145 మంది కరోనా వైరస్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. ఇంత వరకు రాష్ట్రంలో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 8063 కు చేరుకుంది.
Covid19 Bulletin: 1st July 2020
Total Confirmed Cases: 16514
Deceased: 253
Recovered: 8063
New Cases: 1272
Other information: Telemedicine facility, Corona watch application and Helpline details.#KarnatakaFightsCorona#Covid19Karnataka@BSYBJP pic.twitter.com/53mHW2yaQz — cm of karnataka (@CMofKarnataka) July 1, 2020
ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 8194 కేసులు యాక్టివ్ గా కొనసాగుతున్నాయి. ఇందులో 292 మందికి సీరియస్ గా ఉండడంతో వారిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అలాగే నేడు ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా ఏడు మంది మరణించగా దీనితో నేటి వరకు రాష్ట్రంలో 253 మరణాలు కరోనా వైరస్ ద్వారా సంభవించాయి.
ఇక నేడు ఒక్కరోజే బెంగళూరు మహానగరంలో ఏకంగా 735 కేసులు నమోదు కావడంతో నగరంలోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం కొనసాగిస్తున్నారు.