సేఫ్ జోన్ లో ఉంది హైదరాబాద్ అంటున్న పోలీస్ అధికారి..!!

KSK

తెలంగాణ రాష్ట్రంలో భయంకరంగా కరోనా వైరస్ వ్యాప్తి ఉన్నట్లు ఇటీవల కేంద్రం బయటపెట్టిన లెక్కల్లో తేలటం జరిగింది. అసలు ముందు నుండి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయటం లో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది అని అందువల్లే ఇంత దారుణంగా వైరస్ వ్యాప్తి చెందింది అంటూ విమర్శలు ప్రతిపక్షాల నుండి మరియు ప్రజల నుండి వస్తున్నాయి. ఇదిలా ఉండగా గ్రేటర్ హైదరాబాదు ప్రాంతంలో కూడా భయంకరంగా వైరస్ వ్యాప్తి ఉంది అని స్వయంగా తెలంగాణ మంత్రులే మీడియా ముందు ఇటీవల తెలపడం జరిగింది. తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఇటీవల మాట్లాడుతూ రాబోయే రోజుల్లో హైదరాబాద్ నగరాన్ని పూర్తిగా లాక్‌డౌన్‌ చేయనున్నట్లు ప్రకటన చేయడం జరిగింది.

అలా తెలంగాణ మంత్రి ప్రకటన చేసి వారం రోజులు గడవక ముందే హైదరాబాద్ సేఫ్ జోన్ లో ఉంది అంటూ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ కామెంట్లు చేయటంతో హైదరాబాద్ ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆయన ఏమన్నారంటే హైదరాబాద్ లో కరోనా మరణాల సంఖ్య తక్కువేనని, అందువల్ల ప్రజలు భయపడవద్దని అంజనీకుమార్ విజ్ఞప్తిచేశారు. డిల్లీ, ముంబై, చెన్నై లతో పోల్చితే హైదరాబాద్ లో కరోనా వల్ల మరణించినవారు తక్కువే అని పేర్కొన్నారు. కరోనా వైరస్ గురించి ప్రజలు ఆందోళన చెందనవలసరం లేదని యధావిధిగా ప్రభుత్వం సూచిస్తున్న సూచనలు పాటిస్తూ బతికితే సరిపోతుందని చెప్పుకొచ్చారు.

అంతేకాకుండా హైదరాబాద్ ఎంతో సురక్షితమైనదని అంజనీకుమార్ తెలిపారు. జనత కర్ప్యూ నుంచి ఇంతవరకు ప్రజలు అన్ని విదాలుగా సహకరించారని ప్రజలను కొనియాడారు. ప్రజల భద్రత కోసం పోలీస్ శాఖ నిరంతరం పని చేస్తున్నట్లు కాబట్టి ఎవరూ భయపడాల్సిన అవసరం లేనట్లు భరోసా ఇచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: