హైదరాబాద్ లో కరోనా కేసులు పెరగడానికి కారణం ఆ లోపమేనట ?

ప్రస్తుతం ఎక్కడికక్కడ కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరగడం సర్వసాధారణం అయిపోయింది. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని చోట్లా, ఈ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నాయి ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కువగా ఈ కేసులు నమోదు అవుతుండడం ఎవరికీ అంతుపట్టడం లేదు. తెలంగాణ మొత్తం నమోదవుతున్న కేసులు సంఖ్యతో పోలిస్తే, ఒక హైదరాబాద్ మహానగరంలో నమోదైన కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటం ఆలోచనలో పడేస్తోంది. అసలు సిటీలో ఎందుకు ఈ కరోనా కేసులు ఇంత తీవ్రంగా పెరుగుతున్నాయి ? రోజుకు వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదు కావడానికి కారణం ఏమిటి ? ప్రభుత్వం  ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా, ఈ వైరస్ ఎందుకు అదుపులోకి రావడం లేదు, అనే విషయాలు ఎవరికీ అంతుబట్టడం లేదు.

 

తెలంగాణ మొత్తం నమోదయ్యే కేసుల్లో దాదాపు 80 శాతం కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదవుతున్నాయి. దీనికి కారణాలు ఏంటి అనే విషయంపై సర్వే నిర్వహించగా, ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ముఖ్యంగా పట్టణ పరిధిలో కేసుల పెరగడానికి కారణం విటమిన్ డి లోపం అని, దాని కారణంగానే హైదరాబాద్ లో కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి అనే విషయం బయటపడింది. నగరంలో ప్రతి 100 మందిలో 70 నుంచి 80 మంది విటమిన్-డి లోపం ఉందని, వివిధ సర్వేల్లో తేలిందట. విటమిన్ డి లోపం ఉన్న వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం, వైరస్ ఎక్కువగా సోకే అవకాశం ఉండడానికి కారణం అవుతోందని, సూర్యరశ్మి తగలకుండా ఉన్నవారిలోనే సుమారు 80 శాతం మందికి విటమిన్ డి లోపం ఉన్నట్లు సర్వేలో తేలింది.

 

 

సాధారణంగా ఎవరికైనా కరోనా వైరస్ సోకితే సైటోకిన్స్ ఎదురుదాడి చేసి శరీరంలోని ఇతర మూల కణాలను దెబ్బతీస్తాయి. దాని కారణంగా రోగుల రక్త కణాలు దెబ్బతిని గుండె కిడ్నీలు, కాలేయం వంటి ప్రధాన అవయవాలు దెబ్బతింటాయి. ఇది జరగకుండా సైటోకిన్స్ అనేవి సక్రమంగా పనిచేయాలంటే విటమిన్ డి శరీరానికి ఎంతో అవసరం. విటమిన్ డి లోపం ఏర్పడితే, ఎముకలు, కండరాలు పట్టు కోల్పోతాయి. అలాగే గుండె వ్యాధులు శ్వాస సంబంధిత వ్యాధులు ఎక్కువవుతాయి. సూర్యకిరణాలతో పడేలా ఆరుబయట కాసేపు ఉండడం, చేపలు, గుడ్లు, వెన్న, పాలు వంటి వాటిలో ఈ విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఆ ఆహారం కూడా ఎక్కువగా తీసుకుంటే ఈ లోపాన్ని అధిగమించడంతో పాటు కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కునే శక్తి శరీరానికి అందించినట్టు అవుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్న మాట. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: