డిపాజిట్ చేస్తే ఎక్కువ వడ్డీ... క్షణాల్లో పర్సనల్ లోన్... ఎలానో తెలుసా...?
దేశంలోనే రెండో అతిపెద్ద బ్యాంక్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ తాజాగా కొన్ని సర్వీసులను ప్రారంభించింది. దీని ద్వారా ఎన్నో బెనిఫిట్స్ పొందవచ్చు. తన కస్టమర్లకి నిజంగా మంచి అవకాశాలను అందిస్తోంది పలు రకాల ఆఫర్లతో పంజాబ్ నేషనల్ బ్యాంక్. తాజాగా కొత్త సర్వీస్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. నిజంగా ఇది కస్టమర్లకి బంపర్ ఆఫర్ అని చెప్పాలి. అయితే ఏం ప్రారంభించింది..? అన్న విషయానికి వస్తే చాలానే చెప్పాలి. సీనియర్ సిటిజన్ల కోసం పలు రకాల ఆఫర్లు కూడా అందుబాటు లోకి తీసుకు వచ్చింది.
Today in PNB Pathshala, we will find out about the special advantages or facilities PNB provide to its senior citizen customers. To know more, please visit: https://t.co/6kCrEugjnZ #PNBPathshala #PNBSaluteElders #SeniorCitizenSchemes pic.twitter.com/H35iBWLxYp — punjab National bank (@pnbindia) June 29, 2020
వీటన్నిటిని తెలియజేయడానికి ట్విట్టర్ లో కూడా వీటిని పెట్టింది. సీనియర్ సిటిజన్స్ ఆరోగ్యాన్ని దృష్టి లో ఉంచుకుని పంజాబ్ నేషనల్ బ్యాంక్ సరి కొత్త స్కీమ్ ని ప్రారంభించింది సీనియర్ సిటిజన్ లకి ఇన్స్టంట్ పర్సనల్ లోన్ అందిస్తామని చెప్పింది. కేవలం ఈ ఒక్కటి మాత్రమే కాకుండా తక్కువ వడ్డీకే లోన్ తీసుకోవచ్చు అని చెప్పింది. అయితే దీని ప్రధాన ఉద్దేశం ఏమిటంటే సీనియర్ సిటిజన్ జీవితానికి రక్షణ కల్పించడమే. అలానే సీనియర్ సిటిజన్స్ ఫిక్స్డ్ డిపాజిట్ల పై 0.5 శాతం ఎక్కువ వడ్డీ పొందొచ్చని బ్యాంక్ చెప్పింది. వాళ్ల రిటైర్మెంట్ అనంతరం ఎక్కడికి కావాలంటే అక్కడికి ఫిక్సిడ్ డిపాజిట్ ఎకౌంట్ ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని కూడా చెప్పింది. ఉచితంగా చెక్ కలెక్షన్ సర్వీసులు కూడా అందిస్తామని ప్రకటించింది.
నామినేషన్ ఫెసిలిటీ కూడా ఉచితంగా ఉంటుందని చెప్పింది. రిటర్న్ రెమిట్టన్స్ పై 50 శాతం రాయితీ తో పాటు పెన్షన్ బిల్లు కూడా ఉచితంగా తీసుకోవచ్చు అని చెప్పింది. ఇవన్నీ ఇలా ఉంటే పదిహేను వేలు రూపాయలు వరకు విలువగల ఎక్స్టర్నల్ చెక్ వెంటనే సెటిల్ అవుతుందని పంజాబ్ నేషనల్ బ్యాంక్ చెప్పింది. సీనియర్ సిటిజన్స్ కి కొత్త పాస్ బుక్కులు కూడా ఇస్తామని చెప్పింది. నిజంగా ఇది సీనియర్ సిటిజన్ లకి సువర్ణవకాశం.