ఎల్జి పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో అరెస్టులు స్టార్ట్ చేసిన జగన్ సర్కార్..!!

KSK

వైయస్ జగన్ ప్రభుత్వం మంచి దూకుడు మీద ఉంది. పరిపాలనలో గత ప్రభుత్వం చేసిన అవినీతి ని వెలికితీస్తూ సంబంధిత మంత్రులను అరెస్టు చేస్తూ సరి కొత్త నిర్ణయాలు తీసుకుంటుంది. పాలన విషయం లో ప్రజల భద్రత విషయంలో ఎక్కడా కూడా వెనుకడుగు వేయకుండా కాంప్రమైజ్ అవకుండా అనుకున్న నిర్ణయాన్ని వెంటనే అమలు చేసేస్తుంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ లాక్ డౌన్ లో విశాఖ పట్టణంలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ విషవాయువు గ్యాస్ లీక్ విషయంలో అప్పట్లో పన్నెండు మంది చనిపోగా వందలాది మంది ఆసుపత్రి పాలవటం వెంటనే జగన్ ఘటనా స్థలానికి చేరుకొని చనిపోయిన క్షతగాత్రులకు దిమ్మతిరిగిపోయే విధంగా నష్టపరిహారం చెల్లించడం మనకందరికీ తెలిసిందే.

 

ఇదిలా ఉండగా అసలు విశాఖ ఎల్జి పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటన ఎలా జరిగింది అనే దానిపై జగన్ సర్కార్ నివేదిక తేప్పించుకోవటం ఇటీవల మనం చూశాం. అయితే విశాఖపట్నం సమీపంలోని వెంకటాపురం వద్ద జరిగిన ఎల్జి పాలిమర్స్ గ్యాస్ లీక్ కు సంబంధించి జరిగిన ఘటనకు కారణం యాజమాన్యం నిర్లక్ష్యమే అని నివేదికలో బయటపడటంతో జగన్ సర్కార్ ఎల్జీ పాలిమర్స్ ఘటనకు సంబంధించి యాజమాన్యాన్ని అదుపులోకి తీసుకోవడానికి రెడీ అయింది. ఇప్పటికే కొంత మందిని అరెస్టు చేయడం జరిగింది.

 

అదికారిక కమిటీ ఈ గ్యాస్ లీకేజీలో యాజమాన్యం నిర్లక్ష్యం ఉందని నిర్దారణ చేయడంతో ప్రభుత్వం సంబందిత అదికారులపై కేసులు నమోదు చేసింది. పోలీసులు పన్నెండు మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం వచ్చింది. విశాఖ పర్యావరణ ఇంజనీర్లు ఇద్దరిని కూడ సస్పెండ్ చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో సిఈఓ సన్ కి జియాంగ్, డైరెక్టర్ డిఎస్ కిమ్, అడిషనల్ డైరెక్టర్ రామరావు తదితరులు ఉన్నారు. ఏపీ సర్కార్ ఒక్కసారిగా ఎల్జీ పాలిమర్ యాజమాన్యం ని అదుపులోకి తీసుకోవడంతో ఒక్కసారిగా ఏపీలో ఈ వార్త సెన్సేషనల్ అయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: