వై.ఎస్‌. ఇంటి పేరు వెనుక ఓ ఇంట్రస్టింగ్‌ స్టోరీ..?

Chakravarthi Kalyan

వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి... ఆ పేరులోనే రాజసం ఉట్టిపడుతుంది. మరి ఇంతకీ వైఎస్ అంటే ఏంటి..? అదో ఇంటిపేరు.. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ.. ఈ ఇంటి పేరులో ఓ ప్రత్యేకత ఉంది. వై అంటే యెడుగూరి.. ఎస్ అంటే సందింటి.. ఈ రెండు పదాల్లో అసలు ఇంటి పేరు యెడుగూరి మాత్రమే.. మరి ఈ సందింటి అనే పదం ఎలా వచ్చి చేరింది..? 

 


దీని వెనుక ఓ కథ ఉంది. పులివెందులలో .. వైఎస్ పూర్వీకులు ఉన్న ఇల్లు  సందులో ఉండేది.. అందులోనూ యెడుగూరి అనే ఇంటి పేరు ఉన్న కుటుంబాలు కూడా మరికొన్ని ఉండేవి.. ఇలా రెండు, మూడు ఉన్నప్పుడు గ్రామల్లో ప్రత్యేకంగా మరో గుర్తు వాడుతుండే వారు.. అలాగే వైఎస్ పూర్వీకుల గురించి చెప్పేటప్పుడు కూడా సందింటి వారు అనే చెప్పేవారు. అలా ఆ సందింటి వారు సందింటి వారు అని చెప్పడం ద్వారా సందంటి అనేది కూడా ఇంటి పేరులో కలిసిపోయింది.

 


కొన్నాళ్లకు నోటి మాట ద్వారా యెడుగూరి సందింటి వారు అని చెప్పుకునేది కాస్తా రికార్డుల్లోకీ అలాగే ఎక్కింది.. అప్పటి నుంచి యెడుగూరి సందింటి అనేది పూర్తి ఇంటి పేరుగా మారిపోయింది. ఇప్పుడు వైఎస్ అనేది ఓ పాపులర్ పేరుగా మారింది. వైఎస్ రాజారెడ్డి.. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ఇప్పుడు ఆ తరంలోని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. ఇలా ఇప్పుడు ఆ వైఎస్ అనేది ఓ బ్రాండ్ పేరులా మారిపోయింది. 

 


ఇంటి పేరు విషయంలో తెలుగు వాళ్లకు ఓ ప్రత్యేకత ఉంది. దక్షిణ భారతంలోని తమిళనాడు, కేరళ, కర్నాటకల్లో సాధారణంగా సొంత ఊరి పేరుకానీ.. తండ్రి పేరు కానీ తప్పకుండా ఉంటాయి. అలాంటప్పుడు ఒకే ఇంటి పేరు కొనసాగదు. కానీ తెలుగులో ఆ సంప్రదాయం లేదు. ఒకే ఇంటి పేరు అలా తరతరాలుగా వస్తుంటుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: