జీవిత సత్యాలు: మీరు ఇలాంటి తప్పు చేస్తున్నారా...?

Chakravarthi Kalyan

ఓవ్యక్తి.. ఓ ఇంట్లో ఉన్నాడు.. ఆ ఇంటి తలుపులూ, కిటీకీలు అన్నీ మూసేసుకున్నాడు.. ఆ తర్వాత బయటకు వచ్చే అవకాశం లేకుండా గడియలు బిగించుకున్నాడు.. ఇప్పుడు.. అయ్యో ఈ ఇంట్లో ఇరుక్కుపోయాను.. నన్ను కాపాడండి.. అంటూ కేకలు పెడుతున్నాడు. ఈ ఇంటి నుంచి నన్ను బయట పడేయండి మొర్రో అంటూ మొత్తుకుంటున్నాడు..

 


అరే అదేంటి.. ఆయనే ఇంట్లోకి వెళ్లి గడిపెట్టుకుని.. మళ్లీ.. ఎందుకు అరుస్తున్నాడు.. అంటారు.. అది చాలా విచిత్రంగా అనిపిస్తుంది కదా.. మరి ఇప్పుడు మనలో చాలా మంది చేస్తున్న పని అదే.. మనకు మనమే మన చుట్టూ అనేక బంధనాలు ఏర్పాటు చేసుకుంటున్నాం.. అందులో అవసరం లేనివీ.. అవసరం ఉన్నవీ అన్నీ ఉన్నాయి. వాటిపై ప్రేమ పెంచుకుంటున్నాం.

 

 


మళ్లీ ఆ బంధనాల  నుంచి విముక్తి కోరుతున్నాం.. అందుకే ముందు మనల్ని మనం సమీక్షించుకోవాలి.  మనం ఎక్కడ లాక్ అవుతున్నామో గుర్తించాలి. అనవసర బంధనాలు వదిలించుకునే ప్రయత్నం చేయాలి.. ఆ ప్రయత్నంతోనే మనకు కాస్త స్వేచ్ఛ, విముక్తి దొరుకుతాయి. అదే సమయంలో విశాల దృక్పథం అలవరచుకోవాలి. 

 


ఇంట్లోకి స్వచ్ఛమైన గాలి, పుష్కలంగా వెలుతురు రావాలంటే ముందుగా చేయాల్సింది..  తలుపులు విశాలంగా తెరవడం.. అలాగే మన మనస్సు కూడా.  మనసును విశాలం చేసి చూస్తేనే  మనలోని లోటుపాట్లను గుర్తించగలం. అప్పుడే వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయగలం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: