శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాలంటే తీసుకోవాల్సిన ఆహార పదార్థాలివే....?

Reddy P Rajasekhar

మనలో చాలామంది చిన్నచిన్నపనులు చేసినా అలసిపోతూ ఉంటారు. మరికొంతమంది తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. ఇంకొంతమందిని జలుబు, జ్వరం, ఇతర ఆరోగ్య సమస్యలు తరచుగా బాధ పెడుతున్నాయి. విటమిన్ డీ లోపించినా, శరీరానికి తగిన పోషకాలు అందకపోయినా ఇలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవడం సాధ్యమవుతుంది. 
 
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ద్వారా మాత్రమే వైరస్ ను జయించడం సాధ్యమవుతుందని వైద్యులు చెబుతున్నారు. పుచ్చకాయ, క్యాబేజీ, వెల్లుల్లి, స్వీట్ పొటాటో, పెరుగు, పాలకూర, బాదం, సీ విటమిన్ ఎక్కువగా ఉండే పళ్లు కూడా రొగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. 
 
కాలేయం, చేపలు, తోటకూర, మునగాకు, మొక్కజొన్న, రాగులు, సోయా, రాజ్మా, బొబ్బర్లు, లవంగాలు, యాలకులు, బీన్స్, టమాట, రెజిన్స్, బొప్పాయి సైతం రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడతాయి. మనం వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో యాంటీ ఆక్సిడెంట్స్ పాళ్లు పెరిగి ఇన్‌ఫెక్ష‌న్లు, జ‌బ్బుల బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో పాటు జలుబు, ఫ్లూ లాంటి సమస్యలు దూరమవుతాయి. 
 
నిమ్మ‌కాయ‌, ఆరెంజ్‌, బ్రోక‌లి, క్యారెట్‌, పుట్ట‌గొడుగులు, ఓట్స్‌, ఉల్లిగ‌డ్డ‌లు, ప‌సుపు వంటి ఆహార ప‌దార్థాలు కూడా మ‌న శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డానికి స‌హాయ‌ప‌డుతాయి. రోగనిరోధక శక్తిని పెంచుకుంటే వ్యాధుల భారీన పడే అవకాశాలు తక్కువగా ఉందటంతో పాటు వైరస్ సోకినా త్వరగా కోలుకునే అవకాశాలు ఉంటాయి. తగిన మోతాదులో మన శరీరానికి పోషకాలు, విటమిన్లు అందితే మాత్రమే అందం, ఆరోగ్యం లభిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి విటమిన్ డీ కూడా చాలా అవసరం. ప్రధానంగా డీ విటమిన్ సూర్యరశ్మి నుంచి లభిస్తుంది. డీ విటమిన్ రోగ నిరోధక కణాల పనితీరును మెరుగుపరుస్తుందని పలు పరిశోధనల్లో తేలింది 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: