గాంధీ ఆసుపత్రిలో రోబో సేవలు.. నిమిషాల్లో వైరస్ అంతం..?

praveen
తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా  వైరస్ కేసులు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా  వైరస్ వెలుగులోకి వచ్చిన మొదటి నుంచి కరోనా  పేషెంట్లు అందరికీ కేరాఫ్ అడ్రస్గా మారింది గాంధీ హాస్పిటల్. ప్రస్తుతం రోజురోజుకు కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో గాంధీ ఆసుపత్రిలో కరోనా రోగులు నిండిపోయారూ.  ఇక గాంధీ ఆసుపత్రిలో కరోనా  రోగులకు సేవలు అందిస్తున్న హాస్పిటల్ సిబ్బంది కొరత కూడా ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో  కరోనా బాధితులకు సేవలందించేందుకు గాంధీ హాస్పిటల్ కు పరిశుభ్రత కోసం ఆధునిక పరికరం ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది.

మొబైల్ రాపిడ్ వైరస్ డిస్ ఇన్ఫెక్షన్ రోబోను రీవాక్స్ ఫార్మా సంస్థ గాంధీ హాస్పిటల్ కు విరాళంగా ఇచ్చింది. ఈ పరికరం విలువ 12 లక్షల వరకు ఉంటుంది. ఇక ఈ రోబో పేరు యువిరోనా  రోబో.. ఈ రోబో  ప్రత్యేకత ఏమిటంటే ఎలాంటి రసాయనాలు వాడకుండా నిమిషాల్లో వైరస్ను నాశనం చేస్తుంది. గాంధీ ఆసుపత్రి లో కరోనా  పేషెంట్ల వార్డు ప్రాంతంలో ఈ రోబో ఎంతగానో ఉపయోగపడుతుంది. పేషెంట్ డిశ్చార్జి అయి వెళ్ళిపోగానే.. కరోనా  పేషెంట్లు అప్పటి వరకు ఉన్న బెడ్  సహా చుట్టుపక్కల ప్రాంతం మొత్తం కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే ఎలాంటి వైరస్  లేకుండా పూర్తిగా క్లీన్ చేసేస్తుంది.

అంతే కాకుండా మళ్లీ కొత్త పేషెంట్ వచ్చే ముందు కూడా ఆ బెడ్ ని పూర్తిగా శుభ్రం చేస్తుంది ఈ రోబో. కేవలం ఒక్క బటన్ నొక్కితే చాలు ఈ రోబో తన పని తాను చేసుకుంటూ పోతుంది.  కరోనా  పేషెంట్లు ఉండే బెడ్  మాత్రమే కాకుండా... ఐసీయూ గదులను వైద్యులు వేసుకునే దుస్తులు.. పీపీఈ కిట్లు  మాస్కులు తదితరాలు అన్నింటిని నిమిషాల వ్యవధిలో డిస్ ఇన్ఫెక్షన్ చేసేస్తుంది ఈ రోబో. అయితే విద్యుత్ తో  పనిచేసే ఈ రోబోకి బయట నుంచి ఎలాంటి రసాయనాలు అందించాల్సిన అవసరం లేదని అంతేకాకుండా శుభ్రం చేసేటప్పుడు శబ్దాలు వాసనలు రావని  చెబుతున్నారు రివాక్స్  సంస్థ ప్రతినిధులు. కరోనా  రోగులకు చికిత్స అందించే విషయంలో ఈరోబో  గాంధీ ఆస్పత్రిలో ఎంతగానో ఉపయోగ పడుతుందని చెబుతున్నారు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: