తెలంగాణ మార్చ్ సందర్భంగా తెలంగాణ ప్రాంతం పోలీసు ప్రాంతంగా మారింది. తెలంగాణ ప్రాంత ప్రజలు క్షణక్షణం భయంగా బతుకును వెళ్లదీస్తున్నారు. తెలంగాణ వాదులు ఎక్కడికి వెళ్లాలో, ఎక్కడుండాలో, ఎలా ఉండాలో కూడా పోలీసులే నిర్ణయిస్తున్నారు. ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులకు స్వేచ్చ లేకుండా పోయింది. దీంతో పోలీసులే రాజ్యాన్ని నడుపుతున్నట్లు స్పష్టమవుతుంది.
తెలంగాణ మార్చ్ సందర్భంగా పోలీస్ బాస్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ మార్చ్ ను శాంతిభద్రతల సమస్యగా చూపడంతో తెలంగాణలో పోలీసుల రాజ్యం నడుస్తుందని తెల్సిపోయింది. తెలంగాణ ఉద్యమం విషయంలో ఎటువంటి అనుమతులు ఇవ్వాలో, వద్దో అనే విషయం సంబంధిత హోంశాఖ మంత్రి తేల్చాల్సి ఉండగా అందుకు విరుద్దంగా పోలీసు బాసులే వారి ఇష్టానుసారంగా వ్యవహరించడాన్ని తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తీవ్ర స్థాయిలో మండి పడ్డారు.
ప్రజాస్వామ్య దేశంలో ప్రజాప్రతినిధులకు గౌరవం లేకుండా పోయిందనేది కేవలం తెలంగాణ ప్రాంతంలోనే జరుగుతుండవచ్చు. వేలాది, లక్షలాది మందికి ప్రాతినిధ్యం వహించే ప్రజా ప్రతినిధులను ముందుస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకోవడంను పోలీసుల రాజ్యంగానే పరిగణిస్తున్నారు. ఏదైనా విద్రోహ చర్యలకు పాల్పడితే వారిని ఆ కేసులో అరెస్టు చేయవచ్చు, కాగా అందుకు విరుద్దంగా వేలాది మందిని అదుపులోకి తీసుకొని వారు ఏదైనా విద్రోహ చర్యలకు పాల్పడవచ్చునని ముందుగానే అదుపులోకి తీసుకుంటున్నామని పోలీసులు వాదించడంను ఏ విధంగా అర్ధం చేసుకోవచ్చు. తెలంగాణ మార్చ్ సందర్భంగా తెలంగాణ వాదులందరు శాంతి భద్రతల సమస్యను సృష్టిస్తామని పోలీసులకు తెలియజేశారా లేకపోతే పోలీసు అధికారులకు నిద్రలో ఏదైనా కళ వచ్చిందా తెలియదుగాని మెత్తంగా తెలంగాణ ప్రాంతంలో పోలీసు రాజ్యమే నడుస్తుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: