భారీ బాంబ్ బ్లాస్ట్ కి పాకిస్థాన్ కొత్త వ్యూహం.. భారత్ ప్రతి వ్యూహం అదుర్స్..??

praveen

భారత దేశంతో పాకిస్తాన్ ప్రత్యక్ష యుద్ధంలో గెలవలేదు... ఒకవేళ ప్రత్యక్ష యుద్ధమే గనుక వస్తే భారత ధాటికి... చిత్తు చిత్తు  అయిపోతుంది పాకిస్తాన్. అందుకే ఎప్పుడు దొంగచాటు యుద్ధానికి తెర లేపుతోంది పాకిస్తాన్. ఎప్పుడు సరిహద్దుల్లో పాక్ సైన్యం భారత సైన్యంపై దొంగచాటుగా కాల్పులు జరపడం... లేదా కరుడుగట్టిన ఉగ్రవాదులను భారతదేశంలో కి పంపించి బాంబు పేలుళ్లకు సహకరించడం లాంటివి చేస్తూ ఉంటుంది. సరిహద్దుల్లో భారత్ ను నాశనం చేసేందుకు ఎప్పుడూ ఏదో ఒక కుట్ర పన్నుతూనే ఉంటుంది పాకిస్తాన్. ఈ మధ్య కాలంలో మాత్రం పాకిస్తాన్ పప్పులు ఉడకడం లేదు అన్న విషయం తెలిసిందే. 


 ఇటీవలే భారత సైన్యానికి పూర్తి అధికారాలు వచ్చిన నేపథ్యంలో... ఎప్పటికప్పుడు పాకిస్తాన్ నుంచి భారత్ లోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నిస్తున్న వారిని మట్టిబెడుతూనే ఉన్నాయి భారత  బలగాలు. అంతే కాకుండా అటు వైపున ఉగ్రవాద సైనిక స్థావరాలపై కూడా దాడులు చేసి నాశనం చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ పాక్ ఎత్తులన్నింటిని చిత్తు చేస్తున్నాయి భారత బలగాలు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ సరికొత్త ప్లాన్ లి  తెరలేపినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులను మట్టుబెడుతున్న  నేపథ్యంలో స్లీపర్ సెల్స్ ని  రంగంలోకి దింపింది  పాకిస్తాన్. 

 


 ఇటీవలే స్లీపర్ సెల్స్ ని భారత బలగాలు ఎన్కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. అయితే కేవలం జమ్మూకాశ్మీర్ లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా పాకిస్తాన్ కు సంబంధించిన స్లీపర్ సెల్స్  ఉన్నారు అన్నది తాజా సమాచారం. జమ్మూకాశ్మీర్లో రిపబ్లిక్ డే రోజున భారీ బాంబు బ్లాస్ట్ చేసేందుకు ఆత్మాహుతి దాడి కోసం ప్లాన్ చేసినటువంటి ఐఎస్ఐఎస్ తీవ్రవాద సంస్థకు చెందిన సాడియా అన్వర్ షేక్ , నబిల్  సిద్ధిక్ కాత్రి అనే  ఇద్దరిని మహారాష్ట్రలోని పూణేలో పోలీసులు పట్టుకున్నారు. ఇక వీరిని పట్టుకోవడానికి పోలీసులు సినిమా తరహాలో చేస్ చేశారు అని చెప్పాలి. ఐఎస్ఐఎస్ దగ్గర ట్రైనింగ్అయిన ఈ ఇద్దరిపై గత కొంత కాలం నుంచి ఎన్ఐఏ నిగ  ఉంచింది... ఈ క్రమంలోనే వీరిని వెంబడించి మరి పట్టుకున్నారు అధికారులు. ఇక ఇలాంటి కుట్రలను భగ్నం చేసే ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: