కొత్త ప్లాన్ సిద్ధం చేసిన మోదీ సర్కార్... చైనాకు షాక్.....?

Reddy P Rajasekhar

భారతదేశం ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, పాక్ దేశాలతో సరిహద్దులను పంచుకుంటోంది. చాలా దేశాలతో సరిహద్దులను పంచుకున్నా మన సైన్యం మాత్రం శత్రుదేశమైన పాక్ పైనే ఎక్కువగా దృష్టి పెడుతుంది. చైనా సరిహద్దులపై భారత్ గతంలో దృష్టి పెట్టాల్సిన అవసరం రాలేదు. కానీ గత రెండున్నర నెలలుగా ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ ఆ దేశంపై గట్టిగానే దృష్టి పెడుతోంది. 
 
చైనా సరిహద్దు విషయంలో మన దేశం కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఆ దేశం చొరబాట్లకు పాల్పడుతూ మన దేశ భూభాగాన్ని ఆక్రమించుకునే ప్రయత్నాలు చేసింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గినా భారత్ ఆ దేశాన్ని నమ్మే స్థితిలో లేదు. భారత్ ఇకపై చైనాపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు భద్రతా చర్యలు చేపట్టనుంది. భారత్ ఇందుకోసం రీక్రియేషనల్ ఏరియల్ వెహికిల్ తో పాటు అన్ మ్యానుడ్ ఏరియల్ వెహికిల్ లను కొనుగోలు చేయనుంది. 
 
ఈ ప్రత్యేకమైన డ్రోన్ల ద్వారా సరిహద్దు ప్రాంతాల్లోని పరిస్థితులను సులభంగా గమనించవచ్చు. వాస్తవాధీన రేఖ వెంబడి డ్రోన్లను పెద్దసంఖ్యలో మోహరించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. భారత్ ఇకపై పాక్ ను ఏ దృష్టితో చూసిందో చైనాను అదే దృష్టితో చూడనుంది. భారత్ ఈ దిశగానే అన్ని ఏర్పాట్లు చేస్తోంది. సరిహద్దు ప్రాంతంలో ఏం జరిగినా వెంటనే సమాచారం అందేలా భారత్ చర్యలు చేపట్టబోతుందని తెలుస్తోంది. 
 
ఎయిర్ ఫోర్స్ కు భారత్ ప్రత్యేక పరికరాలను కూడా ఇస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ భారత్ చైనా విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. ఆ దేశానికి చెందిన 59 యాప్ లపై భారత్ నిషేధం విధించింది. గతంలో పలు రాష్ట్రాలు చైనా కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకున్నాయి. ప్రత్యేక డ్రోన్లను కొనుగోలు చేస్తూ ఎయిర్ ఫోర్స్ కు ప్రత్యేక పరికరాలను ఇస్తూ మోదీ సర్కార్ వేసిన కొత్త ప్లాన్ చైనాకు భారీ షాక్ అనే చెప్పాలి. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: