మోదీ సంచలన నిర్ణయం- ఆర్మీకి ఆ విషయంలో ఫుల్ పవర్స్..!?

Chakravarthi Kalyan

సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో మోడీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. సరిహద్దుల్లో పోరాటానికి మన సైన్యానికి మరింత వెసులుబాటు కల్పిస్తోంది. ఆయుధాల కొనుగోళ్ల విషయంలో గతంలో ఎన్నడు లేనంత స్వేచ్ఛ ఇచ్చింది. రూ.300 కోట్ల వరకు ఆయుధ సామగ్రిని ఎలాంటి అనుమతులు లేకుండానే కొనుగోలు చేసుకొనే అధికారాన్ని ఇచ్చింది. 300 కోట్ల లోపు కొనుగోళ్లకు ప్రభుత్వ అనుమతి అవసరం లేదని స్పష్టం చేసింది. 

 

 

ఇప్పటి వరకూ సైన్యానికి ఏమైనా ఆయుధాలు కొనాలంటే అదో పెద్ద ప్రక్రియ. ముందుగా సైన్యం అవసరాలు నివేదించడం.. దానికి ప్రభుత్వం అనుమతించి నిధులు విడుదల చేయడం.. ఆ తర్వాత ఒప్పందాలు చేసుకోవడం.. ఆపై ఆయుధాలు సైన్యం చేతికిరావడం.. ఈ మొత్తం ప్రక్రియకు చాలా సమయం తీసుకునేది. ఇప్పుడు ఆయుధం కావాలంటే.. ఈ ప్రక్రియ ఎంత వేగంగా ముగిసినా ఓ సంవత్సరం తర్వాత ఆయుధాలు సైన్యం చేతికి వచ్చేవి. 

 

 

 

 

ఇప్పుడు మోడీ సర్కారు ఆ ఇబ్బంది లేకుండా చేస్తోంది. రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలో జరిగిన రక్షణ కొనుగోళ్ల మండలి సమావేశంలో ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు.  ఇకపై అత్యవసర పనుల నిర్వహణ కోసం ఆయుధాలు కొనుగోలు చేసుకొనే ప్రత్యేక అధికారాన్ని సైన్యానికి కట్టబెట్టారు. రూ.300 కోట్ల వరకు ఎన్నైనా ఒప్పందాలు కుదుర్చుకోవచ్చని ఈ భేటీ నిర్ణయించింది. 

 

 


ఇటీవల వేడెక్కిన లద్దాఖ్‌ తో పాటు సరిహద్దుల్లోని పరిస్థితిని ఈ సమావేశం చర్చించింది.  సైన్యాన్ని మరింత పటిష్ఠంగా మార్చాల్సిందేనని నిర్ణయించింది. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం.. ఎన్ని కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నా ఫర్వాలేదని... వాటి విలువ మాత్రం రూ.300 కోట్లలోపే ఉండాలని కేంద్ర ప్రభుత్వం సైన్యానికి క్లారిటీ ఇచ్చింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: