అమెరికాలో కరోనా కరాళ నృత్యం.. ఒకేరోజు 67 వేల కేసులు!

Edari Rama Krishna

ప్ర‌పంచ వ్యాప్తంగా కోవిడ్ టెర్ర‌ర్ సృష్టిస్తోంది. రోజురోజుకీ కరోనా వైరస్ మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతల మయ్యాయి. రోజురోజుకీ కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య‌, మరణాల సంఖ్య‌ పెరుగుతూనే ఉన్నాయి. ఇప్ప‌టికే ఈ వైర‌స్ బారిన ప‌డి ప‌లువురు ప్ర‌ముఖులు కన్నుమూసిన విష‌యం తెలిసిందే. తాజాగా ప్రపంచవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,34,62,873 నమోదు కాగా అలాగే కరోనాతో మొత్తం 5,81,317 మంది మరణించారు. ఇక ప్రస్తుతం 50,29,095 యాక్టీవ్ కేసులు ఉండగా, 78,52,461 మంది కోవిడ్ నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.  

కాగా అమెరికాలో ఇంత భారీ స్థాయిలో కేసులు న‌మోదు కావ‌డం ఇదే మొద‌టి సారి. ఇక బ్రెజిల్, ఇట‌లీ, ఫ్రాన్స్, మెక్సికో, లండ‌న్ వంటి ప‌లు దేశాల్లో కూడా క‌రోనా కేసులు విప‌రీతంగా న‌మోద‌వుతున్నాయి. గత కొంత కాలంగా అమెరికాలో కరోనా కరాళ నృత్యం చేస్తుంది.  గ‌త ప‌ది రోజులుగా ప్ర‌తిరోజు 55 వేల నుంచి 65 వేల పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి.

తాజాగా గ‌త 24 గంట‌ల్లో దేశంలో రికార్డుస్థాయిలో 67,632 క‌రోనా కేసులు కొత్త‌గా న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య 36,16,747కు చేరింది. ఈ వైర‌స్ వ‌ల్ల ఇప్ప‌టివ‌ర‌కు 1,40,140 మంది మృతిచెందారు. మ‌రో 18,30,645 మంది చికిత్స పొందుతుండ‌గా, 16,45,962 మంది బాధితులు కోలుకున్నారు.  మొత్తం న‌మోదైన కేసుల్లో 80,37,140 మంది బాధితులు కోలుకోగా, 5,067,610 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: