మా తర్వాత టాప్ లో భారత్.. స్పష్టం చేసిన అమెరికా..?

praveen
ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని  కరోనా  వైరస్ కదిలిస్తోంది. ఇప్పటికే లక్షల్లో ప్రాణాలను బలితీసుకుంది. ఇంకా కోట్ల మంది ని మృత్యువుతో పోరాడేలా చూస్తుంది. ప్రతి ఒక్కరి జీవితాన్ని అతలాకుతలం చేసింది. మానవ జీవితంలో ఎన్నడూ చూడని వింతలు కరోనా  వైరస్ ప్రస్తుతం చూపిస్తుంది. చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా మహమ్మారి వైరస్.. అది పుట్టిన ప్రాంతంలో తగ్గింది కానీ మిగతా ప్రాంతాలను  మాత్రం వదలడం లేదు. ఏకంగా మరణ మృదంగం మోగిస్తూ విలయతాండవం చేస్తోంది. కరోనా  అనే పేరు వింటే  చాలు ప్రపంచం మొత్తం భయంతో వణికిపోయే విధంగా తయారయింది ప్రస్తుత పరిస్థితి. ఇక ఈ మహమ్మారికి  ఇప్పటి వరకు సరైన మందు కూడా తెరమీదికి రాకపోవడంతో నివారణ ఒక్కటే మార్గంగా మారిపోయింది. అయితే ప్రపంచ అగ్రరాజ్యమైన అమెరికా లో ఈ మహమ్మారి వైరస్ ప్రపంజనం  అంతా ఇంతా కాదు అన్న విషయం తెలిసిందే.




ఏకంగా అక్కడ లక్షకు పైగా కరోనా  మరణాలు ఉండడంతో పాటు 35 లక్షల  కరోనా కేసులు కూడా ఉన్నాయి. కరోనా వైరస్ కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో. ప్రభుత్వాలు సామర్థ్యం కంటే ఎక్కువ మొత్తంలో కరోనా పరీక్షలు చేసేందుకు సిద్ధపడుతున్న  విషయం తెలిసిందే. అయితే ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో జరుగుతున్న కరోనా  నిర్ధారణ పరీక్షలకు సంబంధించి తాజాగా అమెరికా వైట్ హౌస్ నుంచి ఓ ఆసక్తికర ప్రకటన విడుదలైంది. కరోనా నిర్దారిత పరీక్షల్లో  ప్రపంచంలోని అన్ని దేశాల్లోకెల్లా  అమెరికా మొదటి స్థానంలో ఉంది అంటూ తెలిపింది. అదే సమయంలో అత్యధిక కరోనా  పరీక్షలు నిర్వహించిన దేశాల్లో  అమెరికా తర్వాత భారత దేశం టాప్ లో ఉన్నట్లు వైట్ హౌస్ నుండి ఒక ప్రకటన వెలువడింది.



అయితే అమెరికాలో ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 4.2 కోట్ల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా... ఇప్పటివరకు భారత్ లో 1.2 కోట్ల పరీక్షలు నిర్వహించారు. ఇలా ప్రపంచంలోనే అత్యధిక కరోనా పరిక్షలు  చేసిన దేశాల్లో  అమెరికా మొదటి స్థానంలో ఉండగా భారత్ రెండో స్థానంలో ఉంది. తాజాగా కరోనా  వైరస్ కు సంబంధించి ఓ ప్రశ్న ఎదురైన నేపథ్యంలో వైట్  హౌస్  ప్రెస్  సెక్రటరి  కైలీ  మేక్ నాని ఈ విషయాన్ని వెల్లడించారు.Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: