చైనాకి భారీ షాక్.. రంగంలోకి 22 యుద్ధ నౌకలు.. ఇక మూడో ప్రపంచ యుద్దమేనా.?
ప్రస్తుతం చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకు మరింత చర్చనీయాంశంగా మారుతున్న విషయం తెలిసిందే. సామ్రాజ్యవాద విస్తరణవాద ఆలోచనతో ప్రస్తుతం కనిపించిన భూభాగమల్లా తమ దేశానికి చెందినది అంటూ సరికొత్త వివాదానికి తెరలేపుతున్నారు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్. గతంలో ఎలా అయితే నియంత హిట్లర్ సామ్రాజ్యవాద విధానంతో... ప్రపంచ యుద్ధానికి కారణమయ్యారో.. ప్రస్తుతం జిన్ పింగ్ వ్యవహారం కూడా మరో ప్రపంచ యుద్ధానికి దారి తీసేలా కనిపిస్తుంది. ప్రపంచం మొత్తాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్... ప్రతి దేశంతో కూడా సరికొత్త వివాదానికి తెర లేపుతున్నారు.
ఇప్పటికే ఓ వైపు భారత్ తో సరిహద్దులో వివాదం కొనసాగిస్తూనే మరోవైపు ఇతర దేశాలతో కూడా కొత్త వివాదానికి తెర లేపుతున్నారు. తాను చైనాకు శాశ్వత అధ్యక్షుడిగా ఉండాలనే ఒక కోరికతో... దేశ ప్రయోజనాలను పక్కనపెట్టి మరి దారుణాలకు పాల్పడుతున్నాడు. గత కొన్ని రోజుల నుంచి జపాన్ తో కూడా ఓ వివాదానికి తెరలేపిన విషయం తెలిసిందే. జపాన్ లో ఉన్నటువంటి సుకోయిన్ దీవులు చైనా కు సంబంధించినవే అంటూ చైనా అధికారిక మ్యాప్ కూడా విడుదల చేసింది.. అయితే ఎన్ని అధికారిక మ్యాప్ లు విడుదల చేసినప్పటికీ ఆ భూభాగం మాత్రం మాదే అంటూ జపాన్ అక్కడ పరిపాలన కార్యకలాపాలు జరుపుతుంది.
ఈ మధ్య కాలంలోనే దీవులు తమవేనంటూ జపాన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో కొరివితో తల గోక్కున్నట్లుగా వ్యవహరించింది చైనా. జపాన్ కు సంబంధించినటువంటి సముద్ర జలాల్లోకి యుద్ధనౌకలతో వెళ్ళింది చైనా. వెంటనే వెనక్కి వెళ్లాలంటూ జపాన్ పలుమార్లు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇక ఎన్నిసార్లు చెప్పినప్పటికీ చైనా తీరు మాత్రం మారక పోవడంతో సంచలన నిర్ణయం తీసుకున్న జపాన్ ప్రభుత్వం ఏకంగా 22 యుద్ధనౌకలను రంగంలోకి దింపింది. అమెరికా భారత్ తో కలిసి విన్యాసాలు చేస్తూనే ప్రస్తుతం 22 యుద్ధ నౌకలను తీరంలో రంగంలోకి దింపింది జపాన్. ఈ సారి కనుక చైనా తోక జాడించి దగ్గరికి వస్తే... ఇక సరైన బుద్ధి చెప్పడానికి సిద్ధమైపోయింది జపాన్. ఒకవేళ ఇదే జరిగితే కనుక మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయడం ఖాయం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందన్నది చూడాలి మరి.