కరోనా ను జయించాడు.. ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు..?

praveen
మనిషి జీవితం దేవుడి చేతిలో కీలుబొమ్మ లాంటిది అని అంటూ ఉంటారు. ఇక్కడ  జరిగిన ఘటన చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఇక్కడొక వ్యక్తి కి  కరోనా నుంచి బతికి బయట పడ్డాడు కానీ ఆ ఆనందం  ఎక్కువ రోజులు ఉండలేదు. నిజంగా ఈ ఘటన చూస్తే దేవుడు ఆడిన వింత నాటకమే  అని అనిపిస్తూ ఉంటుంది. ఎన్నో ఏళ్ల నుంచి కిడ్నీ  సమస్యతో బాధపడుతున్నాడు. ఇటీవలే కరోనా  వైరస్ బారిన పడ్డాడు. అప్పటికే కిడ్నీ సమస్య ఇక ఎప్పుడూ ప్రాణాంతకమైన కరోనా... ఇక అతను ప్రాణాలతో బయటపడటం అసాధ్యం అని అనుకున్నారు అందరు, కానీ ఎవరూ ఊహించని విధంగా కరోనా నుంచి బయటపడ్డాడు సదరు వ్యక్తి. కానీ చివరికి ఇప్పుడు ప్రాణాల మీదకి వస్తుంది.



 ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ లో చోటుచేసుకుంది. మాదాపూర్ కు చెందిన బాలరాజు  6ఏళ్ల క్రితం నుంచి కిడ్నీలు చెడిపోవడంతో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు.  ఆరేళ్ల నుంచి ఆరోగ్యశ్రీ కింద హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్నాడు, ఇక ఇటీవలే  హైదరాబాద్ కి  డయాలసిస్  చేసుకునేందుకు వెళ్లగా అక్కడ మరో డయాలసిస్ పేషెంట్ కి కరోనా  పాజిటివ్ అని తేలడంతో అక్కడ ఉన్న మిగతా పేషంట్స్ అందరికి కరోనా  నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ క్రమంలోనే బాలరాజుకు  కూడా టెస్ట్ చేయగా పాజిటివ్ అని వచ్చింది.



ఇక డయాలసిస్ అనంతరం కరోనా  చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రిలో చేరగా.. 16 రోజుల పాటు చికిత్స తీసుకొని కోలుకున్నాడు బాలరాజు. దీంతో డయాలసిస్ చికిత్స కోసం గతంలో తాను వెళ్లిన ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగా... ప్రస్తుతం డయాలసిస్ చేయడం కుదరదని మరో హాస్పిటల్ కు వెళ్లాలంటూ  వైద్యులు సూచించారు. వేరే హాస్పిటల్ కి వెళ్ళిన ఇదే సమాధానం వచ్చింది. ఇక ఆలేరు లోని మరో ఆసుపత్రికి వెళ్లగా కరోనా  వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ మరో 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సిందే అంటూ వైద్యులు తెలిపారు.. ఈ క్రమంలోనే  హైదరాబాద్లోని ఓ ఐసోలేషన్ కేంద్రంలో టెస్టు చేయించుకోవాలంటూ  బాలరాజును వైద్యులు పంపించారు. దీంతో డయాలసిస్ పేషెంట్ అయినప్పటికీ ఆసుపత్రుల చుట్టూ తిరగడానికి సమయం సరిపోతుంది బాలారాజు. దీంతో బాలరాజు  ఆరోగ్యం మరింత క్షీణించి మరింత ఆందోళన చెందుతున్నాడు.Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: