నేపాల్ లో సీన్ రివర్స్.. చైనా ఇది ఉహించి ఉండదూ..?

praveen

అంతకుముందు వరకు నేపాల్ భారత్ మధ్య మంచి సంబంధాలు కొనసాగాయి... కానీ భారత సరిహద్దు దేశాలన్నింటిని  తమ అధీనంలోకి తెచ్చుకునే  ప్రయత్నాల్లో భాగంగా  చైనా  నేపాల్ ని కూడా పెట్టుబడులు పేరుతో ఆకర్షించిన విషయం తెలిసిందే. అదే ఈ సమయంలో నేపాల్ ప్రధాని ఓలి శర్మ  మరికొంత మంది ఎంపీల ఖాతాల్లోకి కూడా భారీగా డబ్బులు జమ కావడం కూడా బయటకు రావటం  సంచలనం గా మారిపోయింది. చైనాతో సాన్నిహిత్యాన్ని నేపాల్  దేశ ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఓలి  ప్రభుత్వంపై అటు దేశ ప్రజానీకంలో  తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 


 ఈ నేపథ్యంలో నేపాల్ లో  ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. ఇదే  సమయాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు ప్రతిపక్ష పార్టీలు. దీంతో తీవ్రస్థాయిలో ఓలి  ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడానికి కాలు దువ్వుతున్నారు. దీంతో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం కూడా నెలకొంటుంది. ఈ నేపథ్యంలో నేపాల్ లో  సీన్ క్షణక్షణం మారిపోతుంది. ప్రతిపక్ష పార్టీ నేత అయిన ప్రచండ ఓలి వర్గాల  మధ్య జరుగుతున్నటువంటి వార్ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తుంది.. అయితే  చైనా... ఓలి  శర్మ వెనుక ఉండటంవల్ల ప్రచండ పావులు కదలడం లేదు.. వ్యూహాలు ఫలించటం లేదు. తెరవెనుక ఉండి నేపాల్ రాజకీయాలు ను కంట్రోల్ చేస్తుంది చైనా. 

 ఇలాంటి పరిణామాల నేపథ్యంలో  ఇటీవలే నేపాల్ లో ఉన్నటువంటి కాస్కె లో.. ఓలి  ప్రచండ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు చేయి చేసుకుని దారుణంగా  కొట్టుకున్నారు కూడా. ఏకంగా పది మందికి తీవ్ర గాయాలయ్యి  ఆసుపత్రి పాలయ్యారు. ఇందులో ఒకరి పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ప్రస్తుతం ఓలి  శర్మ ప్రభుత్వాన్ని వెనుక నుండి కాపాడుతుంది చైనా అని భావించిన నేపాల్ విపక్ష పార్టీలు అన్ని ఒక్కతాటిపైకి వస్తున్నాయి. ప్రచండ, మాధవ్ కుమార్ వర్గాలు ఒక్కటై ఓలి  కి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి.మరి  ఈ పరిణామాలు ఎక్కడివరకు  దారితీస్తాయి అన్నది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: