పవన్ వాళ్లను పొగుడుతుంటే వీళ్లకు బాధ ఏంటో ?

జనసేన పార్టీ రాజకీయంగా బలం లేకపోయినా, భవిష్యత్తులో పుంజుకుంటుందనే ఆశలు లేకపోయినా, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ఉన్న ప్రజాకర్షణ, బలమైన సామాజిక వర్గం, కోట్లాదిమంది ఫ్యాన్స్ ఫాలోయింగ్, యువతలో ఆయనకున్న క్రేజ్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కేంద్ర అధికార పార్టీ బిజెపి జనసేన తో పొత్తు పెట్టుకుంది. ఏపీలో జనసేన ప్రభావం పెద్దగా లేదనే విషయం మొన్నటి ఎన్నికల్లో తేలిపోయింది. కేవలం ఒక్క సీటు కు మాత్రమే పరిమితం అయిపవడంతో అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. అయినా పవన్ ఇమేజ్ ను దృష్టిలో బిజెపి జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుంది. కానీ ఏపీలో బీజేపీ ఏ కార్యక్రమాలు నిర్వహించినా జనసేన పెద్దగా పట్టించుకోనట్టుగానే వెళ్తోంది. దీంతో అసలు బీజేపీ జనసేన పొత్తు ఉందా ? లేదా అనే అనుమానాలు జనాల్లో మొదలయ్యాయి. ఇదిలా ఉంటే, పవన్ మాత్రం సందర్భం వచ్చిన ప్రతిసారి కేంద్ర పెద్దలను అదేపనిగా పొగుడుతూ వస్తున్నారు.

 


 సొంత పార్టీని బలోపేతం చేసుకునే విషయంపై దృష్టి పెట్టడం మానేసి, తమ మిత్రపక్షమైన బీజేపీని పొగడడమే పనిగా పెట్టుకున్నారు. ఇక ప్రతి సందర్భంలోనూ, బీజేపీ అగ్రనేతలను పదే పదే పవన్ పొగుడుతున్న తీరు ఏపీ బీజేపీ నేతలకు మింగుడుపడడం లేదు. ఏపీ బీజేపీలో ప్రజా నాయకులు పెద్దగా లేకపోవడంతో, జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. కానీ ఏపీ బీజేపీ నాయకులను పెద్దగా పట్టించుకోనట్టుగానే పవన్ కూడా వ్యవహరిస్తూ, కేంద్ర పెద్దల దృష్టిలో తాను పడితే చాలు అన్నట్లుగా వ్యవహరిస్తుండడం వంటి పరిణామాలు ఏపీ బీజేపీ నేతలకు ఆగ్రహం కలిగిస్తున్నాయి. 


ఇప్పుడు ఏపీ బీజేపీ నేతలు పెద్దగా పట్టించుకోనట్టుగానే వ్యవహరిస్తూ, ఆ పార్టీ అగ్రనేతలను, కేంద్రం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రస్తావిస్తూ పవన్ హడావుడి చేస్తున్నారు. అడుగడుగున ఏపీ ప్రభుత్వంపై పవన్ విమర్శలు చేస్తూనే, కేంద్రాన్ని అదేపనిగా పొగుడుతూ వస్తుండడం జనసైనికులకు కూడా పవన్ రాజకీయం ఏంటో అర్థం కావడం లేదు. అలాగే ఇటీవల ఏపీ కి సంబంధించిన అన్ని అంశాలపై రాష్ట్ర నేతలతో బిజెపి వర్చువల్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్, పవన్ పేరును ప్రస్తావించి, ఆయన ను పొగడడంతో ఏపీ బీజేపీ నేతలు అవాక్కయ్యారు. 


పవన్ కేంద్ర బిజెపి పెద్దలకు దగ్గర అయితే, తమను ఇకపై పెద్దగా లెక్కచేయరు అని, తమ ప్రభావానికి గండి పడుతుంది అనే అభిప్రాయంలో ఉన్నట్టు గా కనిపిస్తున్నారు. భవిష్యత్తులో పవన్ కు బిజెపి తరఫున ఏదైనా కీలక పదవి ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని, అలాగే 2024 నాటికి బీజేపీ తరపున సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందనే ఆందోళన ఏపీ బీజేపీ నేతల్లో కనిపిస్తోంది. పవన్ బిజెపిలో ఈ విధంగా ఎదుగుతూ వెళ్తే తమ ప్రభావానికి గండి పడుతుంది అనే అభిప్రాయంలో ఏపీ బిజెపి సీనియర్ నాయకులు ఉన్నట్లుగా కనిపిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: