ఏపీ ప్రజలకు షాకింగ్ న్యూస్... మరోసారి లాక్ డౌన్ ప్రతిపాదనలు....?

Reddy P Rajasekhar

ఆంధ్రప్రదేశ్ లో గత వారం రోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 5000కు పైగా కేసులు నమోదు కావడంతో ప్రజలు వైరస్ పేరు వింటే గజగజా వణుకుతున్నారు. ప్రభుత్వం పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలు చేస్తున్నా వైరస్ అదుపులోకి రావడం లేదు. 
 
అధికారులు ఎన్ని చర్యలు చేపడుతున్నా రాష్ట్రంలో వైరస్ విజృంభిస్తోంది. 
కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ ఆంధ్రప్రదేశ్ లో రెండు వారాల పాటు లాక్ డౌన్ ప్రకటిస్తే మంచిదని ప్రతిపాదనలు చేస్తోంది. అయితే జగన్ సర్కార్ ఈ ప్రతిపాదనపై ఎటూ తేల్చుకోలేకబోతుందని సమాచారం. లాక్ డౌన్ ప్రకటిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. 
 
దాదాపు రెండున్నర నెలల పాటు అమలులో ఉన్న లాక్ డౌన్ వల్ల రాష్ట్రం ఆర్థికంగా నష్టపోయింది. రాష్ట్రంలో ఇప్పటికే భారీ సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తూ ఉండటం, కరోనా రోగులకు చికిత్స కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉండటంతో ప్రభుత్వం లాక్ డౌన్ పట్ల సుముఖత వ్యక్తం చేయడం లేదని తెలుస్తోంది. అయితే కేసుల సంఖ్య మరింత పెరిగితే మాత్రం లాక్ డౌన్ అమలు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. 
 
గతంలో తెలంగాణ సర్కార్ హైదరాబాద్ లో లాక్ డౌన్ విధించాలని భావించినా కేంద్రం అంగీకరించలేదు. ఏపీలో లాక్ డౌన్ అమలు చేయాలన్నా కేంద్రం అనుమతులు ఇచ్చే అవకాశాలు తక్కువ. కేంద్రం కేసుల తీవ్రతను బట్టి లాక్ డౌన్ విషయంలో నిర్ణయాలను తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినప్పటికీ లాక్ డౌన్ అంశంలో కేంద్రం అనుమతి తప్పనిసరి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళుతుందో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: