గుడ్ న్యూస్: రూ .10కే కొత్త ఎల్ఈడీ బల్బ్..!
కొత్త ఎల్ఈడీ బల్బులను తక్కువ ధరకే అందించడానికి ఒక కంపెనీ రెడీ అయ్యింది. ఒక్క కంపెనీ సరికొత్త ప్రోగ్రాంతో అందరికి ఎల్ఈడీ బల్బులు అందించనున్నారు. ఈ పోగ్రామ్ ద్వారా బల్బులను కేవలం రూ. 10కే అందించడానికి సిద్ధం అవుతుందని కంపెనీ డైరెక్టర్ తెలియజేశారు.
దీని గురించి ఈఈఎస్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ కుమార్ మాట్లాడుతూ.. ఉజ్వల స్కీమ్‌లో భాగంగా గ్రామాల్లోని ఒక్కో కుటుంబానికి 3 నుంచి 4 బల్బులను అందిస్తామని తెలిపారు. ఒక్కో బల్బుకు రూ.10 తీసుకుంటామని పేర్కొన్నారు. అలాగే కస్టమర్లు ఏవైనా మూడు పాత బల్బులు అందించాల్సి ఉంటుందని తెలిపారు. ఎల్ఈడీ బల్బులను దేశంలో దాదాపు 15 కోట్ల కుటుంబాలకు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలియజేశారు.
ఈ కొత్త స్కీమ్ ద్వారా దాదాపు 50 కోట్ల బల్బులను ప్రజలకు అందిస్తామని ఆయన తెలిపారు. అంటే దాదాపు 12,000 మెగా వాట్ల ఎలక్ట్రిసిటీ ఆదా అవుతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా కార్బన్ ఉద్ఘరాలు కూడా వార్షికంగా 5 కోట్ల టన్నులు తగ్గుతాయని తెలిపారు. ఎన్టీపీసీ, పీఎఫ్సీ, ఆర్ఈసీ, పవర్ గ్రిడ్ కంపెనీల జాయింట్ వెంచరే ఈఈఎస్ఎల్. ఈ కంపెనీ ఇప్పటికే 36 కోట్లకు పైగా ఎల్ఈడీ బల్బులను విక్రయించింది. ఒక్కో బల్బు ధర రూ.70. వీటిల్లో ఎక్కవ బల్బులను పట్టణ ప్రాంతాల్లోనే విక్రయించింది. అందుకే ఈసారి గ్రామీణ ప్రాంతాల్లో వీటిని విక్రయించాలని నిర్ణయించుకుంది.
ఈ గ్రామీణ్ ఉజ్వల్ స్కీమ్ కింద అతిత్వరలోనే ఎల్ఈడీ బల్బులను గ్రామాల్లో విక్రయిస్తామని కంపెనీ తెలిపారు. ఒక్కో బల్బును రూ.10 చొప్పున గ్రామీణులకు అందిస్తామని పేర్కొన్నారు. వచ్చే 3 నుంచి 6 నెలల కాలంలో దేశంలోని అన్ని గ్రామాల్లోనూ ఈ పథకాన్ని దశల వారీగా అమలు చేస్తామని వివరించారు. కేంద్రం, రాష్ట్రాల దగ్గరి నుంచి ఎలాంటి సబ్సిడీ తీసుకోమని, కలిగే నష్టాన్ని కార్బన్ విక్రయం ద్వారా భర్తీ చేసుకుంటామని సౌరభ్ తెలిపారు.