యుద్ధానికి సిద్ధమవుతున్న భారత్... ఇప్పటికే సరిహద్దుల్లో..?

praveen

ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దు లో తలెత్తిన వివాదం సద్దుమణిగింది అనుకునేలోపే చైనా డబుల్ కి తెరలేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గాల్వాన్ లోయ  దగ్గర మొన్నటి వరకు ఉద్రిక్తత పరిస్థితులు సృష్టించిన చైనా... ప్రస్తుతం అక్కడ వెనక్కి వెళ్ళిపోయింది. కానీ పాంగ్వాన్  సరస్సు దగ్గర మాత్రం చైనా వెనక్కి వెళ్లేందుకు ససేమిరా అంటుంది. పాంగ్వాన్ సరస్సు  దగ్గర కూడా వెనక్కి వెళ్లాలి అంటూ  ఎన్నిసార్లు చర్చలు జరిపినప్పటికీ చైనా మాత్రం వెనకడుగు వేయడం లేదు. మొత్తం చైనా సైన్యం మొత్తం నో మ్యాన్ జోన్ లో  గుడారాలు వేసుకొని తిష్ట వేసుకుంది . ఈ నేపథ్యంలో భారత్ ఎలాగైనా చైనా సైన్యాన్ని వెనక్కి పంపాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 


 అయితే చైనా సైన్యాన్ని వెనక్కి వెళ్లాలని ఇప్పటికే ఎన్నోసార్లు చర్చలు జరిపింది భారత సైన్యం. మొన్నటికి మొన్న ఇరు దేశాలకు చెందిన ఆర్మీ సీనియర్ అధికారులు 15 గంటల పాటు చర్చించిన తర్వాత చైనా పాంగ్వాన్ సరస్సు  దగ్గర వెనక వెళ్లేందుకు ఒప్పుకుంది. కానీ చర్చల్లో  చైనా చెప్పిన మాటలన్ని  నీటి మూటలైపోయాయి. చర్చల్లో  ఇచ్చిన మాటని తుంగలో తొక్కి  మరి చైనా అక్కడే  తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఈ నేపథ్యంలో చైనాను ఎలాగైనా వెనక్కి పంపేందుకు భారత్ సిద్ధపడుతోంది. ఈ క్రమంలోనే యుద్ధం చేసైనా  సరే చైనాని వెనక్కి పంపాలని భారత వ్యూహాలు పన్నుతున్నట్లు  తెలుస్తోంది. 

 సరిహద్దుల్లో  అన్ని పరిస్థితులు చకచకా మారిపోతున్నాయి. ఓవైపు భారత యుద్ధ నౌకలు సముద్రంలో తిరుగుతుండగా... యుద్ధ విమానాలు పేల్చివేసే ఆయుధాలను  లడక్ లోని  సరిహద్దుల్లో కి తరలించారు. అంతేకాకుండా లైట్ వెయిట్ హెలికాప్టర్లు కూడా సరిహద్దుల్లోకి చేరుకున్నాయి . ఒకవేళ  యుద్ధం జరిగితే మిలిటరీ బేస్ లు  ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవాలని  జపాన్ ఇండియా మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏ క్షణాన ఏం జరిగినా కూడా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు అన్నట్లుగా ఉంది ప్రస్తుతం పరిస్థితి.రానున్న  రోజుల్లో  ఏం జరుగుతుందో చూడాలి మరి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: