యువకుడి అతితెలివి.. కరోనా ను క్యాష్ చేసుకుందామకున్నాడు.. కానీ చివరికి..!?
ప్రస్తుతం శరవేగంగా వ్యాప్తిచెందుతున్న కరోనా వైరస్ పేరు వింటేనే ఎంతో మంది ప్రజలు చిగురుటాకులా వణికిపోతున్నారు . ఇక ఈ వైరస్కు వ్యాక్సిన్ కూడా రాకపోవడంతో ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటూ... భయం భయం గానే బతుకుతున్నారు, కరోనా వైరస్ సోకి ఎక్కడ ప్రాణాలు పోతాయో అని అందరు భయంతో బతుకుతూ ఉంటే మరికొంతమంది మాత్రం కరోనా వైరస్ క్యాష్ చేసుకుని నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇక్కడ ఇలాంటి ఘటన జరిగింది . కరోనా వైరస్ ను క్యాష్ చేసుకుని భారీగా డబ్బులు దండుకుంటున్న యువకుడుని ఇటీవలే హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే... శ్రీకాకుళం జిల్లాకు చెందిన రెడ్డి సందీప్ 2016 లో డిగ్రీ పూర్తి చేసి ఆపై హార్డ్వేర్ నెట్వర్కింగ్ కోర్స్ పూర్తి చేశాడు. అయితే ఉద్యోగం కోసం వెతికినప్పటికీ సరైన ఉద్యోగం రాకపోవటంతో.. ఓవైపు నిరుద్యోగం మరోవైపు ఆర్థిక ఇబ్బందులు సందీప్ ను చుట్టుముట్టాయి. దీంతో నేరాలకు పాల్పడుతూ డబ్బులు దండుకోవడం అలవాటు చేసుకున్నాడు సందీప్. పలుమార్లు చోరీల కేసులో జైలుకు వెళ్లి బయటకు వచ్చాడు సందీప్. అయినప్పటికీ అతని తీరులో మాత్రం మార్పు రాలేదు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ ను కూడా క్యాష్ చేసుకున్నాడు.
కరోనా వైరస్ సమయంలో ప్రస్తుతం ప్లాస్మా అవసరం పెరిగిపోయిన నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది ప్లాస్మా డోనర్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని గమనించిన సందీప్ దీనినే సంపాదనగా మార్చుకోవాలని అనుకొన్నాడు. ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో... ప్లాస్మా డోనర్స్ కోసం ప్రకటన ఇచ్చిన వారికి ఫోన్ చేశాడు. తాను ఇటీవలే కరోనా వైరస్ బారినపడి చికిత్స తీసుకొని కోలుకున్నానని.. ప్లాస్మా దానం చేయడానికి సిద్ధంగా ఉన్నారంటూ మాయమాటలు చెప్పాడు . శ్రీకాకుళం నుంచి ప్లాస్మా దానానికి రావడానికి కొన్ని డబ్బులు కావాలి అంటూ కోరీ.. ఇక డబ్బులు అకౌంట్లో పడగానే ఆపై వారి ఫోన్ కి రెస్పాన్స్ ఇవ్వడు. ఇలా 200 మందిని మోసం చేశాడు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు తోసాడు.