శంకుపుష్పంతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో తెలుసా..?

Suma Kallamadi

మన పల్లెటూర్లలో చాలా చోట్ల కనిపించే మొక్క శంకు మొక్క. శంఖువు రూపంలో నీలిరంగులో వుండే పుష్పాలు చూసేవుంటారు. ఈ నీలి రంగు పువ్వులు శనీశ్వరుడికి సమర్పిస్తే.. శనిదోష ప్రభావం తగ్గుతుందని జ్యోతిష్య నిపుణులు అంటారు. ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. దీని ఆకులు, వేర్లు, విత్తనాలు, పువ్వులు అన్నింటినీ ఆయుర్వేదంలో రకరకాల వ్యాధుల నివారణకు వాడుతారు.

 

 

పురాతన కాలం నుంచీ ఈ శంకు పుష్పాలను సంప్రదాయ మందుల్లో వాడుతున్నారు. ఇది బ్రెయిన్‌కి టానిక్‌లా పనిచేసి... మెమరీ పవర్‌, తెలివితేటల్ని పెంచుతుంది. అయితే ఈ పువ్వు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట. నీలి రంగుతో కనిపించే ఈ పుష్పం మానసిక ఆరోగ్యాన్ని ఎంతో మేలు చేస్తుందట. ఈ నీలపు శంఖు పువ్వుల చెట్టు ఆకులతో పసుపుతో రుబ్బి.. వాపు తగ్గుతుంది.

 

 

మహిళలకు గర్భ సంబంధిత రోగాలను నయం చేయడంలో శంఖుపువ్వులు సూపర్‌గా పనిచేస్తాయి. నెలసరి సమస్యలు, సంతాన లేమి, యూరినల్ ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవాలంటే శంఖుపువ్వులను ఎండబెట్టి తీసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. ఈ పువ్వును అక్కడ బటర్ ఫ్లై ఫ్లవర్ అని పిలుస్తున్నారు. ఈ పువ్వును మాసంలో రెండుసార్లు ఆహారంగా తీసుకోవడం ద్వారా మానసిక ఆందోళన మాయమవుతుంది.

 

 

ఓ గిన్నెలో నీరు పోసి వేడి చెయ్యండి. అందులో అల్లం ముద్ద, సోపు పొడి, నిమ్మగడ్డి, పూలను వేసి ఉడకబెట్టాలి. సిమ్‌లో ఐదారు నిమిషాలు ఉడికాక మంట ఆర్పేసి గిన్నెపై మూత పెట్టాలి. రెండు నిమిషాలు ఉంచి వడగట్టి తాగేయడమే.

 

 

ఇది శరీరంలోని ఆమ్లాన్ని తొలగించే యాంటీయాక్సిడెంట్‌గా పనిచేస్తుంది. చర్మాన్ని సంరక్షిస్తుంది. శ్వాస సంబంధిత రోగాలు, హృద్రోగాలన నయం చేస్తుంది. ఒక గ్లాసుడు నీటిలో ఐదు నీలపు శంఖుపువ్వులను వేసి పది నిమిషాల పాటు నాన బెట్టి.. ఆ నీటిని తేనెతో కలుపుకుని తాగితే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. అయితే ఈ పానీయాన్ని మాసానికి ఒకసారి వినియోగిస్తే మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: