గుడ్ న్యూస్.. 90రోజుల్లోనే ఇళ్ల పట్టాలు..!

NAGARJUNA NAKKA

ఏపీలో 20 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా పచ్చతోరణం కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం జగన్‌. ఇబ్రహీంపట్నం సమీపంలో 33 ఎకరాల లే అవుట్‌లో సీఎం జగన్‌ మొక్కలు నాటారు. పచ్చతోరణం కార్యక్రమంలో ప్రజలతో ప్రతిజ్ఞ చేయించిన జగన్‌.. పేదలకు ఇళ్లపట్టాల స్థలాల విషయంలో టీడీపీ అడ్డుపడుతోందని మండిపడ్డారు. అర్హులైన పేదలకు 90 రోజుల్లోనే ఇళ్ల పట్టాలు ఇస్తామని తెలిపారు సీఎం జగన్‌.

 

ఏపీలో జగనన్న పచ్చతోరణం కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. 71వ వనమహోత్సవంలో భాగంగా తలపెట్టిన కార్యక్రమంలో జగన్‌ పాల్గొన్నారు. కృష్ణా జిల్లా ఇబ్రహీం పట్నం సమీపంలోని పేదల 33 ఎకరాల లే అవుట్ లో నేతలతో కలిసి మొక్కలు నాటారు.

 

సీఎం జగన్‌తో పాటు ఇక్కడ స్థలాలు పొందిన 1600 మంది లబ్దిదారులు కూడా మొక్కలు నాటారు. కార్యక్రమానికి వచ్చిన వారితో మొక్కలు నాటుతాం అంటూ ప్రతిజ్ఞ చేయించారు సీఎం జగన్‌. ఏడాదిలో 20 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ప్రజలు స్వచ్చందంగా ఇందులో భాగస్వాములు కావాలని సీఎం కోరారు. 



పచ్చతోరణం వేదికగా ఇళ్ల స్థలాల అంశంపై టీడీపీపై ఫైరయ్యారు సీఎం జగన్‌. పేదలకు ఇళ్లపట్టాలు ఇచ్చేందుకు కూడా ప్రతిపక్షం అడ్డుపడుతోందని విమర్శించారు.  టీడీపీ అన్యాయమైన రాజకీయాలు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ఇళ్లపట్టాలు ఇవ్వడానికి సుప్రీంకోర్టుకు కూడా వెళ్లామని తెలిపారు. అర్హులైన పేదలకు 90 రోజుల్లోనే ఇళ్ల పట్టాలు ఇస్తామని తెలిపారు సీఎం జగన్.

 

రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇళ్ల స్థలాల కోసం 17 వేల లే అవుట్స్‌ను సిద్దం చేసినట్లు తెలిపారు జగన్‌. ఈ లే అవుట్స్ లో కూడా పచ్చదనం ఉండేలా అంతా మొక్కలు నాటాలని సూచించారు. రాష్ట్రంలో కొత్తగా 20 శాతం ఇళ్లనిర్మాణానికి స్థలాలు ఇస్తున్నట్లు సీఎం ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: