చైనా కండకావురం.. మళ్ళీ మోహరింపు.. 40 వేల మంది సైనికులతో..?
చైనా.. భారత్ తో యుద్ధం కావాలి కావాలి అంటూ ఏదో ఒక విధంగా రెచ్చగొట్టే చర్యలు చేపడుతూనే ఉంది . మొన్నటికి మొన్న గాల్వాన్ లోయలో.. ఇక నిన్నటికి నిన్న పాంగ్వాన్ సరస్సు.. ఇప్పుడు మరో ప్రాంతం. ఇలా ఏదో ఒక విధంగా భారత్ తో యుద్ధం చేయాలి అనే విధంగా వ్యవహరిస్తుంది చైనా. గత కొన్ని రోజుల నుంచి చైనా వ్యవహారం అందరికీ తెలిసిన విషయమే. ముందుగా గాల్వన్ లోయలో.. తర్వాత పాంగ్ వాన్ సర్సస్సులో ముందుకు వచ్చి నో మ్యాన్ జోన్ లోకి ఎంటర్ అయింది చైనా. ఈ క్రమంలోనే చైనా భారత్ మధ్య ఫిజికల్ ఎటాక్ కూడా జరిగింది, ఈ ఎటాక్ లో ఇరు దేశాలకు సంబంధించిన సైనికులు కూడా చనిపోయారు.
ఎన్నో చర్చలు తర్వాత గాల్వన్ లో చైనా సైనికులు వెను తిరిగి యథాస్థితికి వెళ్లిన విషయం తెలిసిందే. అంతా సద్దుమణిగింది అనుకుంటున్న తరుణంలో పాంగ్ వాన్ సరస్సు దగ్గర మాత్రం చైనా సైన్యం వెనక్కి వెళ్లలేదు. చర్చలు జరిగినప్పుడు వెనక్కి వెళ్తామని హామీలు ఇస్తున్నప్పటికీ ఆ తర్వాత మాత్రం చైనా మాట నిలబెట్టుకోకుండా అక్కడే తిష్టవేసి కూర్చుంటుంది. ఇప్పటికే భారత్ చైనా సైనికులను ఎలాగైనా వెనక్కి పంపేందుకు సిద్ధమవుతుంది. అది యుద్ధమైనా సామరస్యమైన చర్చలు అయినా సిద్ధమే అంటూ చెబుతుంది భారత్. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో చైనా మరోసారి మరో ప్రాంతంలో మోహరించింది.
గతంలో అరుణాచల్ ప్రాంతంలో మోహరించి పలుమార్లు యుద్ధవాతావరణం సృష్టించిన చైనా మరోసారి అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో ఏకంగా 40 వేలమంది సైనికులను మోహరించింది . 40 వేల మంది సైనికులు అక్కడ మోహరించి అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి 65 వేల చదరపు కిలోమీటర్ల భూభాగం తమదే అంటూ వాదిస్తున్న చైనా... యుద్దానికి సిద్ధమవుతోంది. భారీ మొత్తంలో సైన్యాన్ని మోహరించి కీలక నాటకాలకు తెర లేపుతోంది చైనా. అయితే చైనా దుందుడుకు వ్యవహారాలకు సరిగ్గా బుద్ధి చెప్పేందుకు ఇప్పటికే యుద్దానికి సిద్ధమవుతున్న భారత్ ప్రస్తుత మొహరింపు తో మరింత కఠినతరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు.