అన్ లాక్ 2.0 : ఆ వ్యాధితో బాధ పడే వాళ్లకు కరోనా సోకితే మరింత డేంజర్..?

Reddy P Rajasekhar

దేశంలో కరోనా విలయం కొనసాగుతోంది. కరోనా కేసుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దేశంలో కరోనా విజృంభించిన తొలినాళ్లలో తక్కువ సంఖ్యలో కేసులు నమోదు కాగా అన్ లాక్ 1.0, అన్ లాక్ 2.0 సడలింపుల తర్వాత వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. భారత్ లో ప్రస్తుతం 45,000కు అటూఇటుగా కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నా ఏపీలో మాత్రం ప్రమాదకరస్థాయిలో వైరస్ వ్యాప్తి జరుగుతోంది.   
 
అయితే కరోనా సోకిన వాళ్లలో షుగర్, బీపీ, రక్తపోటులాంటి సమస్యలతో బాధ పడేవాళ్లు మాత్రమే ఎక్కువగా మృతి చెందుతున్నారు. అయితే మధుమేహంతో బాధ పడేవాళ్లకు కరోనా సోకితే మరింత ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కరోనా చికిత్సలో భాగంగా వైద్యులు ఇచ్చే స్టిరాయిడ్ ల వల్ల షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. కరోనా సోకిన వాళ్లు షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. 
 
షుగర్ లెవెల్స్ అదుపులో లేని వాళ్లే వైరస్ భారీన పడి ఎక్కువగా మృతి చెందుతున్నారని ఆంధ్రా మెడికల్ కాలేజ్ ఎండోక్రైనాలజీ డిపార్టుమెంట్ హెడ్ సుబ్రహ్మణ్యం తెలిపారు. కరోనా రోగుల్లో రక్తంలో ఆక్సిజన్ ఉండాల్సిన స్థాయి కంటే తగ్గితే వైద్యులు స్టిరాయిడ్స్ ను వినియోగిస్తారు. మధుమేహం ఉన్నవాళ్లు కరోనా లక్షణాలు కనిపిస్తే వైద్యుల సూచనలు తీసుకుని మందులు వాడాలని సూచిస్తున్నారు. 
 
జ్వరం, ఆయాసం, దగ్గులాంటి కరోనా లక్షణాలు ఉన్న వాళ్లను ఒక కేటగిరీగా మిగిలిన వాళ్లను మరో కేటగిరీగా విభజిస్తారు. జ్వరం ఉన్నవాళ్లకు షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉందని నీళ్లు ఎక్కువగా తాగడం ద్వారా దానిని నియంత్రించవచ్చని వైద్యులు చెబుతున్నారు. దగ్గుతో పాటు ఆయాసం ఉంటే ఆస్పత్రిలో చేరాలని ఎన్నిసార్లు ఇన్సులిన్ ఇవ్వాలన్నది రోగి పరిస్థితిని బట్టి వైద్యులు నిర్ణయిస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: