పవన్ తోడైనా.. కన్నా ఇంకా ఎందుకు మౌనంగా ఉన్నారు..?
ప్రస్తుతం దేశం లో బీజేపీ అజేయ శక్తిగా ఎదిగిన విషయం తెలిసిందే. దాదాపు ఎక్కువ మొత్తం రాష్ట్రాల లో బిజెపి ప్రభుత్వమే కొనసాగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం బీజేపీ ఇంకా పట్టు సాధించ లేకపోతున్నది. ముఖ్యంగా బిజెపి పట్టు సాధించలేకపోతున్న రాష్ట్రాల లో తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రం లో పార్లమెంట్ ఎలక్షన్ లో 4 ఎంపీ స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటింది బిజెపి. ఇక మొన్నటి కి మొన్న తెలంగాణ బిజెపి అధ్యక్షుడి గా బండి సంజయ్ ఎంపికైనప్పటినుంచి మరింత క్రియాశీలకంగా బి.జె.పి ముందుకు సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో మాత్రం ఇంకా పట్టు సాధించ లేకపోతుంది బిజెపి. ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ నేతలు అందరినీ సమన్వయం చేయలేక పోతున్నారు అనే వాదన కూడా ప్రస్తుతం ఆంధ్ర రాజకీయా ల్లో వినిపిస్తోంది. జనసేన పార్టీ తో పొత్తు పెట్టుకొని ఒకటిగా ముందుకు నడుస్తున్నప్పటి కీ బిజెపి..ఆంధ్ర రాజకీయాల పై పట్టు సాధించ లేకపోతుంది. నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా కూడా బిజెపి తన సత్తా చాటి లేక పోతున్నది.
పవన్ కళ్యాణ్ లాంటి మంచి ఫాలోయింగ్ ఉన్న నేత బీజేపీ తో కలిసి నడుస్తున్నప్పటికీ.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ మాత్రం ఎందుకు ఆంధ్ర రాజకీయా ల్లో క్రియాశీలకం గా మారడం లేదు. ఎందుకు జగన్ సర్కార్ పై సరైన రీతిలో పోరాటం చేయలేకపోతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోడైనప్పటికీ కన్నా లక్ష్మీనారాయణ ఎందుకు మౌనంగానే ఉండిపోతున్నారు... ప్రతిపక్ష హోదా లో ఎందుకు పోరాటం చేయలేకపోతున్నారు అన్నది ప్రస్తుతం అందరి లో నెలకొన్న ప్రశ్న. మరి రానున్న రోజుల్లో అయినా జనసేన- బీజేపీ క్రియాశీలక ప్రతిపక్షంగా ఎదుగుతాయా అన్నది చూడాలి మరి.