కరోనా టైం : అందరూ నేతలు ఒకలా.. హరీష్ ఒకలా.. ఎందుకు..?

praveen

తెలంగాణలో ప్రజల మనిషిగా ప్రజల గుండెల్లో నిలిచిన నేతగా పేరు తెచ్చుకున్నారు మంత్రి హరీష్ రావు. ఎలాంటి ఆపద వచ్చినా నేనున్నానని భరోసా ఇస్తారు . ఎలాంటి పరిస్థితులు ఏర్పడిన తనకు  ఓట్లు వేసి గెలిపించిన ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ముందుకు కదులుతారు.  మిగతా నేతలతో పోలిస్తే ప్రజల సమస్యలను తెలుసుకోవటానికి  హరీష్ రావు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. సమస్యలు  తెలుసుకోవడమే కాదు ఆ సమస్యల సత్వర పరిష్కారం అయ్యే విధంగా కూడా ఆదేశాలు జారీ చేస్తారు . 

 


 అయితే ఏకంగా వందల కిలోమీటర్లు ప్రయాణిస్తూ నియోజకవర్గ  వర్గంలోని ప్రజలందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ సొంత మనిషిలా బాగోగులు తెలుసుకుంటారు మంత్రి హరీష్ రావు. ప్రస్తుతం కరోనా  వైరస్ నేపథ్యంలో ప్రజా ప్రతినిధులందరూ ఎక్కువగా ఎక్కడికి  వెళ్లడం లేదు. ఏదైనా ముఖ్యమైన పని ఉంటే తప్ప ప్రజల్లోకి వెళ్లడం లేదు. కానీ కరోనా  సమయంలో కూడా.. ప్రజానేత  మంత్రి హరీష్ రావు అందరికీ నేతల కంటే భిన్నంగా నే ఉన్నారు . కరోనా  వైరస్ సమయంలో అందరు నేతలు  ఇంట్లోనే ఉంటే.. మంత్రి హరీష్ రావు మాత్రం ఇంటి నుంచి ఉదయాన్నే బయటికి వచ్చి నియోజకవర్గం అంతా కలియ తిరుగుతూ తగిన జాగ్రత్తలు పాటిస్తూ.. నియోజకవర్గ ప్రజల బాగోగులు తెలుసుకుంటున్నారు. 

 

 ఇక హరీష్ రావు తన నియోజకవర్గ ప్రజలను పలకరిస్తున్న తీరు ప్రజలను కాస్త భావోద్వేగానికి గురిచేస్తుంది అనే చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలోని టాప్ లీడర్ గా రాష్ట్ర మంత్రిగా ఉన్న హరీష్ రావు లాంటి లీడర్.. ఒక సామాన్య నాయకుడిగా.. నియోజకవర్గ ప్రజలందరిని  ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు. కరోనా  వైరస్ సమయంలో కూడా కారులో నియోజకవర్గం అంతా కలియ తిరుగుతూ  హరీష్ రావు ఆయా గ్రామాల్లో ప్రజలను ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు. అందరికంటే భిన్నంగా కరోనా  సమయంలో కూడా ప్రజల కష్టాలను తీర్చేందుకు ముందుకు కదిలారు మంత్రి హరీష్ రావు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: