సీన్ రివర్స్.. మిత్ర దేశం యూ టర్న్.. చైనా కు భారీ షాక్..?
చైనా భారత సరిహద్దు దేశాలను తన మిత్ర దేశాలుగా మార్చుకుంటూ భారతదేశంపై పోరాటానికి సిద్దం అవుతున్న విషయం తెలిసిందే. అదేంటో కాని ఎక్కడ చైనా పప్పులు మాత్రం ఉడకటం లేదు.ఇటీవలే భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని చైనా కు సంబంధించిన 59 యాప్స్ ని దేశంలో నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో ముఖ్యంగా చెప్పుకోదగినవి ఏదైనా ఉందంటే అది టిక్ టాక్. దేశంలో కోట్ల వినియోగదారులను కలిగి ఉన్న టిక్ టాక్ ఒక్కసారిగా నిషేధానికి గురికావడంతో చైనా కి భారీ రేంజ్ లో నష్టం వచ్చింది అని చెప్పాలి.
టిక్ టాక్ లో అశ్లీలత ఎక్కువగా ఉంది అంటు మరికొన్ని దేశాలు కూడా ఈ యాప్ ని తమ తమ దేశాలలో నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనాకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇక ఇప్పుడు ఏకంగా మిత్ర దేశమే చైనా కు భారీ షాక్ ఇచ్చింది. చైనా కనుసన్నల్లో నడుస్తున్న మిత్ర దేశమైన పాకిస్థాన్..ఈ మధ్య కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవలే పాకిస్తాన్ లో పబ్జి గేమ్ నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది అక్కడి ప్రభుత్వం. పబ్జి ఆట ఇస్లాం సాంప్రదాయాలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంది అంటూ అక్కడ పబ్జి గేమ్ నిషేధించారు.
ఇక ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకుంటూ టిక్ టాక్ ను కూడా పాకిస్థాన్ లో నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది ఇమ్రాన్ ఖాన్ సర్కార్. టిక్ టాక్ లో హద్దులు మీరిన అసభ్యత అశ్లీలత ఉన్న కారణంగా పాకిస్తాన్ లో టిక్టాక్ నిషేధిస్తున్నట్లు తెలిపింది అక్కడి ప్రభుత్వం. అయితే చైనా మిత్ర దేశంగా ఉంటున్నప్పటికీ పాకిస్తాన్ చైనా కు చెందిన టిక్టాక్ నిషేధించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది. పాకిస్తాన్ టిక్ టాక్ విషయంతో చైనా కు భారీ షాక్ తగిలింది అని చెప్పాలి . టిక్ టాక్ నిషేధించిన నేపథ్యంలో దీనిపై చైనా ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి మరి.