వైఎస్ విజయమ్మ పుస్తకంలో కూడా అదే ఉంది.. జగన్ కు రాజుగారి వినూత్న హెచ్చరికలు..?
ఇక తాజాగా మరో ఆసక్తికర అంశాన్ని లేవనెత్తి జగన్ ను వినూత్న రీతిలో హెచ్చరించారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు. ఎవరైనా న్యాయవ్యవస్థను గౌరవిస్తూ పాలన సాగించాలని.. సీఎం జగన్ తల్లి వైయస్ విజయమ్మ ఇటీవల రాసిన నాలో నాతో వైయస్సార్ అనే పుస్తకంలో లిఖించబడి ఉందని... ఆ పుస్తకంలో 75 వ పేజీలో... న్యాయ వ్యవస్థను ఎంతలా గౌరవించాలి అనే విషయాలు ఉన్నాయి అంటూ రఘురామకృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే సీఎం జగన్ తన తల్లి రాసిన పుస్తకాన్ని విడుదల చేశారు తప్ప లోపల ఏం రాసి ఉంది అన్నది మాత్రం చూడలేదు అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి కూడా న్యాయ వ్యవస్థను ఎలా గౌరవించాలి అనే విషయాన్ని చెప్పారని... కానీ ఇవేవీ పట్టించుకోకుండా సీఎం జగన్ రాజ్యాంగ విరుద్ధంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగే విధంగా పాలన సాగిస్తున్నారు అంటూ విమర్శించారు. రాజ్యాంగ సంక్షోభం ఏర్పడితే 356 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి పాలన కొనసాగే అవకాశముందని... జగన్ అక్కడి వరకూ పరిస్థితి వచ్చేలా తెచ్చుకోవద్దని.. ఇప్పటికైనా తీరు మార్చుకుని రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా పాలన సాగించాలి అంటూ అంటూ హెచ్చరికలు జారీ చేశారు రఘురామకృష్ణంరాజు.Powered by Froala Editor