కేటీఆర్ ను మెచ్చుకుంటున్న తెలంగాణ ప్రజలు... ఏం జరిగిందంటే....?

Reddy P Rajasekhar

టీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో ప్రజల సమస్యలకు సోషల్ మీడియా వేదికగా సత్వరమే స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ఉంటారన్న సంగతి తెలిసిందే. ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న కేటీఆర్ తాజాగా తీసుకున్న ఒక నిర్ణయంపై ప్రజల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. తన పుట్టినరోజు సందర్భంగా కేటీఆర్ ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంత్రి కేటీఆర్ పరీక్షల కొరకు తన వంతుగా ఆరు అంబులెన్స్‌లను అందించనున్నట్టు కీలక ప్రకటన చేశారు. 

 


 


ప్రభుత్వ ఆస్పత్రుల కోసం వాటిని వినియోగించుకోవాలని సూచనలు చేశారు. ప్రజల శ్రేయస్సు కోసం తను ఈ అంబులెన్స్‌లను ప్రజలకు అందించన్నట్టు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చిన ఈటల రాజేందర్ కు కేటీఆర్ తెలిపారు. కేటీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని ఈటెల రాజేందర్ స్వాగతించారు. నియోజక వర్గంతో పాటు, కరీంనగర్ జిల్లా పార్టీ తరపున 5 అంబులెన్స్‌లను తన వంతుగా సమకూరుస్తానని ఆయన చెప్పారు. 

 


 
అయితే కేటీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని ఆదర్శంగా తీసుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు తమ వంతుగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళుతూ ప్రజల హృదయాలను గెలుచుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా 11 అంబులెన్స్‌లను సమకూరుస్తామని కీలక ప్రకటన చేశారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తదితరులు ఆంబులెన్స్ లను సమకూరుస్తామని చెప్పారు. 
 
పలువురు టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆంబులెన్స్ లు అందించటానికి సిద్ధం కావడంతో తెలంగాణలో దాదాపు 100 ఆంబులెన్స్ లు సమకూరినట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ ఉధృతి నేపథ్యంలో ఆంబులెన్స్ లు ఎంతో అవసరం. పుట్టినరోజు వేడుకల సందర్భంగా తను ఆరు ఆంబులెన్స్ లు ఇవ్వడంతో పాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆదర్శంగా నిలవడంపై ప్రజల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు కేటీఆర్ పై సోషల్ మీడియా వేదికగా కీర్తిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: