గుడ్ న్యూస్ : కరోనా మందు మరింత అందుబాటులో.. హెటేరో కీలక నిర్ణయం..?
ప్రస్తుతం ఈ కరోనా మందు కొవిఫర్ విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. సాధారణంగా కంపెనీ ఈ వ్యాక్సిన్ కోసం నిర్ణయించిన ధర 5 వేల 400 రూపాయలు మాత్రమే. కానీ ప్రస్తుతం ఈ మందును బ్లాక్ మార్కెట్కు తరలించి ఒక్క బాటిల్ ధర 30 వేల వరకు అమ్ముతున్నారు. దీంతో కొంతమంది చేసేదేమీ లేక భారీగా డబ్బులు చెల్లించి మరి కొవిఫర్ మందు కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హెటిరో కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దాదాపుగా ఈ మందు ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా చూసుకుంటున్న హెట్రో కంపెనీ... ప్రస్తుతం బ్లాక్ మార్కెట్ నుంచి ప్రజలకు కాస్త విముక్తి కల్పించాలని నిర్ణయించింది.
ఈ క్రమంలోనే కీలక నిర్ణయం తీసుకుంది హెటెరో కంపెనీ. హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లి లోని వై జంక్షన్ దగ్గర హెటేరో కు సంబంధించి ఒక ప్రత్యేక కౌంటర్ తెరిచింది. అక్కడ అన్ని వేళలా కోవిఫర్ అందుబాటులో ఉంటుందని... కావలసినవారు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తో మందును కొనుగోలు చేయవచ్చు అంటూ సూచించింది.Powered by Froala Editor