హరీష్ రావు కి తప్ప మరెవ్వరికీ అది సాధ్యం కాదేమో..?

praveen

తన్నీరు హరీష్ రావు... ఇది కేవలం పేరు మాత్రమే కాదు... నాయకత్వ లక్షణాలకు కేరాఫ్ అడ్రస్... ఎంతో మంది ప్రజలకు భరోసా.. ఎంతోమంది రాజకీయ నాయకులకు స్ఫూర్తి... ఎంతో మందికి ఆదర్శం. టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేత హరీష్ రావు రాజకీయ ప్రస్థానం గురించి అందరికీ తెలిసిందే. ఓటమెరుగని నాయకుడిగా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న లీడర్ గా హరీష్ రావు  ఒక ప్రత్యేక స్థానం ఉంది తెలంగాణ రాజకీయాల్లో . నమ్ముకున్న సిద్ధాంతం కోసం.. నమ్మి గెలిపించిన ప్రజల కోసం.. శాయశక్తులా కృషి చేస్తూ.. హరీష్ రావు  ప్రజా నాయకుడు అయ్యాడు. ప్రతి పనిలో తన కార్యదక్షతను నిరూపించుకుంటూ... అసలు సిసలైన లీడర్ గా ఎదిగాడు హరీష్ రావు. 

 


 మామూలుగా సొంత పార్టీ వాళ్లు తమ పార్టీ కీలక నేతల పైన పొగడ్తల వర్షం కురిపించడం కామన్ ... కానీ హరీష్ రావు మాత్రం ఎప్పుడు పార్టీని తిట్టిపోసే ప్రతిపక్షాల నుంచి సైతం ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు సైతం హరీష్ రావు కార్యదక్షతకు ఫిదా అయిపోయారట. ఏకంగా తన కొడుకు లోకేష్ ని రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత హరీష్ రావు ల మాస్ లీడర్ గా ప్రజల గుండెల్లో నిలిచి పోవాలి అంటూ లోకేష్ కి సూచించారట చంద్రబాబు నాయుడు. ఈ విషయాన్ని ఒకానొక సమయంలో ఏకంగా లోకేష్ చెప్పుకొచ్చారు. 

 

 కేవలం లోకేష్ మాత్రమే కాదు ఎప్పుడూ టిఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరుగుతూ విమర్శలు చేసే రేవంత్ రెడ్డి సైతం.. హరీష్ రావు కార్యదక్షతకు... ప్రజల కోసం పాటుపడే నాయకుడు గా ఆయనకున్న ఫాలోయింగ్ కు ఫిదా అయిపోయి ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే సైతం... హరీష్ రావు ను ఏకంగా పని రాక్షసుడిగా అభివర్ణించారు. కాలేశ్వరం నిర్మిస్తున్న సమయంలో చాలామంది హరీష్ రావు పేరును కాళేశ్వరరావు గా కూడా అభివర్ణించారు... అంతలా  తన కార్య దక్షత తో ఎంతో మంది మనసునను  దోచుకున్నారు హరీష్ రావు. ఏసీ కారులో తిరగటం కాదు..  జనాల్లో  ఉంటూ జనం మధ్య జీవిస్తూ.. జనం కోసం బతికే నేతగా ప్రజలు గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: