మోడీకీ, కేసీఆర్ కూ లింక్ పెట్టేసిన రేవంత్ రెడ్డి.. ఏమంటున్నారంటే...?

Chakravarthi Kalyan

రేవంత్ రెడ్డి అంటే ఓ ఫైర్ బ్రాండ్.. ఆయన మాటలు తూటాల్లా పేలతాయి. తెలంగాణ కాంగ్రెస్ లో కాస్త టంగ్ పవర్ ఉన్న నాయకుడు ప్రస్తుతానికి రేవంత్ రెడ్డే.. లోపల విషయం ఎంత ఉన్నా దాన్ని సరిగ్గా ప్రజంట్ చేసే టాలెంట్ లేకపోతే నేటి రాజకీయాల్లో రాణించడం కష్టమే. అందుకే తెలంగాణ కాంగ్రెస్ లో ఎంత మంది అనుభవం ఉన్న లీడర్లు ఉన్నా.. పక్క పార్టీ నుంచి తెచ్చుకుని మరీ రేవంత్ కూ అగ్రపీఠం వేశారు. 

 


తాజాగా కేసీఆర్ సర్కారు వైఖరిని తీర్పారపడుతున్న రేవంత్ రెడ్డి ఈసారి మోడీని కూడా కేసీఆర్ తో కలిపి కుమ్మేశారు. రాజస్థాన్ రాజకీయానికి, తెలంగాణ పాలకులకూ ముడి పెట్టి విమర్శలు చేశారు. దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని.. రాజ్యాంగ ప్రక్రియకు విఘాతం కలుగుతోందని మండిపడ్డారు. 

 

 


మోడీ అండ్ కో వికృత రాజకీయ క్రీడా పరంపరలో మరో రాష్ట్రం చేరిందన్న రేవంత్ రెడ్డి  రాజస్థాన్ లో రాచక్రీడ జడలువిప్పి చెలరేగుతోన్న వైనంపై విమర్శలు  గుప్పించారు. మోడీ సర్కారు  నికృష్టపు, నిరంకుశ వైఖరి పై గొంతెత్తి ప్రశ్నించే ప్రయత్నాన్ని కేసీఆర్ సర్కారు అణగదొక్కుతోందని మండిపడ్డారు. మోడీకి వత్తాసుగా తెలంగాణ  రాష్ట్రంలో కేసీఆర్ సాగిస్తోన్న దారుణ దుశ్చర్యకు కాంగ్రెస్ నేతలను అడ్డుకోవడమే  నిదర్శనమన్నారు రేవంత్ రెడ్డి. 

 


రాజస్థాన్ లో బీజేపీ సాగిస్తోన్న దుర్మార్గాన్ని ప్రశ్నించేందుకు రాజ్ భవన్ కు బయలుదేరిన తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వాన్ని పోలీసులు అడ్డుకుని సమీపంలోని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ వైఖరిపై మండిపడ్డ రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌నూ, మోడీనీ కలిపి విమర్శల వర్షం కురిపించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: