ఐసోలేషన్ వార్డులో కామంతో ఊగిపోయిన డాక్టర్.. ఎంత పని చేసాడు.. చివరికి ఆ డాక్టర్ కి కూడా..?

praveen
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా  వైరస్ విజృంబిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంతో మంది ప్రజలు తీవ్ర భయాందోళన లోనే  బతుకుతున్నారు, అయితే ఈ కరోనా  సమయంలో కూడా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు మాత్రం తగ్గడం లేదు. ప్రాణాలు తీసే కరోనా  సైతం మహిళలపై కాస్తో కూస్తో కరుణ చూపిస్తుందేమో కానీ... మనుషుల ముసుగుల్లో  కామంతో ఊగిపోతున్న రాక్షసులు మాత్రం మహిళలపై దారుణాలకు పాల్పడుతున్నారు. వెరసి ఓవైపు కరోనా  వైరస్ తో పోరాడుతూ బతుకు పోరాటం చేస్తూనే మరోవైపు... కామందుల బారిన పడకుండా ఉండేందుకు మహిళలు మరో పోరాటం చేయాల్సిన దుస్థితి వచ్చింది, ఏకంగా ఐసోలేషన్ వార్డులో సైతం మహిళలకు రక్షణ లేకుండా పోతోంది, కరోనా  వైరస్ సోకి మృత్యువుతో పోరాడుతూ... మంచి వాళ్ళ ముసుగులో ఉన్న కామాంధుల బారినపడి ఐసోలేషన్ వార్డులో మహిళలు బలవుతున్న ఘటనలు  ఈ మధ్యకాలంలో తెర మీదికి వచ్చి సంచలనంగా మారుతున్న విషయం తెలిసిందే.



తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. కరోనా  వైరస్ బారినపడి మృత్యువుతో పోరాడుతున్న యువతిపై.. డాక్టర్ కామంతో ఊగిపోయి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఐసోలేషన్ వార్డులోనే  యువతిపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన నోయిడాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెలుగులోకి వచ్చింది. ఇరవై ఏళ్ల యువతికి ఇటీవలే కరోనా  పాజిటివ్ అని నిర్ధారణ కాగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరింది. కరోనా  పేషెంట్ లకు  చికిత్స అందిస్తున్న ఓ  డాక్టర్ కి  కూడా కరోనా సోకడంతో అతనికి  కూడా పేషంట్స్ లతో సహా చికిత్స అందిస్తున్నారు. కాగా కరోనా బారిన పడిన ఆ వైద్యుడు బ్రతుకు పోరాటం చేయాల్సింది పోయి కామం తో ఊగిపోయాడు. అదే ఐసోలేషన్ వార్డులో ఉన్న యువతిపై దారుణంగా అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటనపై యువతి పోలీసులను ఆశ్రయించి.. ఫిర్యాదు చేసింది.



వెంటనే స్పందించిన పోలీసు అధికారులు యాజమాన్య బాధ్యతారాహిత్యం కారణంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఓకే వార్డులో ఇద్దరు కరోనా  పేషెంట్ లను ఉంచి  చికిత్స అందించినందుకు  గాను చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు కరోనా తగ్గగానే  నిందితుని అరెస్టు చేస్తామని తెలిపారు.Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: