మరి కొద్దిసేపట్లో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం

 హైదరాబాద్: ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొందిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు శుక్రవారం నాడు మధ్యాహ్నం ప్రమాణం చేయనున్నారు. ఉదయం 11గంటలకు పార్టీ శాసనసభా పక్షం నాయకురాలు విజయమ్మ అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో పార్టీ సమావేశం జరగుతోంది. పార్టీ పరంగా చేపట్టబోయే ప్రజా పోరాటాలపై ఇక్కడ చర్చిస్తారు. ప్రధానంగా ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న విత్తనాలు, ఎరువుల కొరతపై ఆందోళన చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేయనున్నారు. అనంతరం మాజీ మంత్రి కొండా సురేఖ ఇంటికి వెళ్లనున్నారు. అక్కడి నుంచి నేరుగా అసెంబ్లీ వెళ్తారు. ఉప ఎన్నికల్లో గెలుపొందిన వైఎస్ఆర్ పార్టీకి చెందిన 15మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ వారితో ప్రమాణం చేయిస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: